Brahmamudi : రుద్రాణిపై డౌట్ పడిన అప్పు.. కావ్య ఏం చేయనుంది!
on Feb 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -955 లో... రాజ్, కావ్య ఛారిటబుల్ ట్రస్ట్ కి ధాన్యలక్ష్మి అడ్డుచెప్తుంది. ఇలా సగభాగం ఆస్తి ట్రస్ట్ కి వెళ్తే మాకేం ఉంటుందని వద్దని కచ్చితంగా చెప్పి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ లోపలికి వస్తారు. అక్కడ ప్రకాష్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏమైంది నాన్న అని కళ్యాణ్ అడుగుతాడు. రాజ్, కావ్య ఒక మంచి పని చేస్తాను అంటే మీ అమ్మ అడ్డుపడుతుందని ప్రకాష్ జరిగింది చెప్తాడు. అమ్మతో ఇప్పుడే మాట్లాడుతానని కళ్యాణ్ వెళ్తుంటే ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది.
అమ్మ ఎందుకు అన్నయ్య వదిన చేస్తున్న దానికి అడ్డుపడుతున్నావని అడుగుతాడు. మొత్తం ఆస్తులు కావ్య పేరున ఉన్నాయి.. ఇప్పుడు సగభాగం ట్రస్ట్ కి రాస్తే నీ పరిస్థితి ఏంటి.. నువ్వు ఎలా బతుకుతావని ధాన్యలక్ష్మి అడుగుతుంది . అమ్మ అది తాతయ్య సంపాదించిన ఆస్తి అందులో నా కష్టం ఏం లేదు.. ఎందుకు ఇలా చేస్తున్నావని కళ్యాణ్ అంటాడు. అయిన ధాన్యలక్ష్మి వినకుండా నేను ట్రస్ట్ కి సగభాగం ఆస్తులు రాస్తానంటే ఒప్పుకోనని చెప్తుంది. మరొకవైపు రాజ్, ధాన్యలక్ష్మి మాటల గురించి ఆలోచిస్తాడు. అత్తయ్యకి కళ్యాణ్ పేరున సగం ఆస్తి రాసి మిగతా సగం ట్రస్ట్ కి రాస్తే అత్తయ్యకి ఏం అభ్యంతరం ఉండదని కావ్య సలహా ఇస్తుంది. అయితే మనం ఎలా బతుకుతామని రాజ్ అనగానే మనకి బిజినెస్ ఉంది.. టాలెంట్ ఉంది మళ్ళీ సంపాదించుకోవచ్చని కావ్య అనగానే నువ్వు చాలా గ్రేట్ అంటూ కావ్యని పొగుడుతాడు రాజ్.
మరొకవైపు అప్పు తన కొలీగ్ కి కాల్ చేసి హాస్పిటల్ లో పాప పై ఎటాక్ చేసిన రౌడీలు ఎవరో సీసీటీవీ పుటేజ్ ద్వారా కనుకొమ్మని అప్పు చెప్తుంది. అందుకు అతను సరే అంటాడు. అప్పుడే కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఎందుకు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. రుద్రాణి అంటీ మినిస్టర్ ఇంట్లో నుండి రావడం ఏంటి.. ఈ పిల్లల్ని మార్చే ప్రక్రియలో తన పాత్ర ఉందా అని అప్పు అంటుంది. రుద్రాణి అత్తయ్య డబ్బు కోసం ఏదైనా చేస్తుంది కానీ ఇలా చేయదని కళ్యాణ్ అంటాడు. నాకు చెయ్యదనే అనిపిస్తుంది కానీ ఎందుకో డౌట్ గా ఉందని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



