Brahmamudi : మినిస్టర్ కి షాకిచ్చిన పంతులు.. కావ్య పాప ఎక్కడ!
on Jan 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -939 లో..... పాపకి ఉన్న అనారోగ్య సమస్య గురించి డాక్టర్ చెప్తారు. అది విని రాజ్, కావ్య షాక్ అవుతారు. పాప పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంది కానీ ఇప్పుడు ఇలా ఎందుకు అయిందో అర్థం కావడం లేదని డాక్టర్ అంటుంది. దీనికి పరిష్కారం ఏంటని రాజ్ అడుగగా ఆపరేషన్ చెయ్యాలి కానీ పది రోజుల పాప కదా తట్టుకుంటుందో లేదో డౌట్ ఆపరేషన్ చెయ్యకపోతే పాప బ్రతకదు.. మీరు నిర్ణయం తీసుకొని చెప్పండి అని డాక్టర్ అనగానే ఏం చెప్పాలి మీరే చెప్పాలి ఆరోగ్యంగా ఉన్న పాపని తీసుకొని అనారోగ్యంతో ఉన్న పాపని మాకు ఇచ్చారని డాక్టర్ పై కావ్య కోప్పడుతుంది.
ఏంటి కావ్య మళ్ళీ మొదలు పెట్టావా అని డాక్టర్ కోప్పడగానే కావ్యని తీసుకొని రాజ్ వచ్చేస్తాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ ఇంటికి వస్తాడు. కావ్యపై కోప్పడుతాడు. బుద్ది లేకుండా ప్రవర్తిస్తున్నావని రాజ్ అంటాడు. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. పాపకి ఉన్న ఆరోగ్యం సమస్య చెప్తాడు. ఒకవైపు డాక్టర్ పాప గురించి చెప్తుంటే.. ఇదేమో మళ్ళీ నా పాపని మార్చారని అంటుంది. నేను నా పాపని ఎలా కాపాడుకోవాలో చూడాలా.. దీన్ని మార్చాలా అని రాజ్ బాధపడుతాడు. ఆ తర్వాత రాహుల్, రేఖ ఇద్దరు రుద్రాణితో వీడియో కాల్ మాట్లాడుతారు. మమ్మీ రిపోర్ట్స్ మంచి ప్లాన్ చేసానిని రేఖ అంటుంది. మీరు ఇద్దరు అక్కడే ఉండి నేను చెప్పినట్లు చెయ్యండి.
ఇంట్లో అందరు పాపని కనిపెట్టుకొని ఉంటారు. పాప విషయంలో కావ్యకి కోపం వచ్చేలా మాట్లాడండి. ఎలాగూ పాప బ్రతకదు కాబట్టి కావ్య నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇక కావ్యని ఇంట్లో అందరు పిచ్చిది అనుకుంటారు. అప్పుడు రాజ్ కి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తారు. రాహుల్ ఆస్తులకి వారసుడు అవుతాడని వాళ్లకు చెప్తుంది రుద్రాణి. ఆ తర్వాత పాపని కావ్య పడుకోబెడుతుంటే రాజ్ వస్తాడు. కావ్య కోపంగా చూస్తుంది. మరొకవైపు మినిస్టర్ ఇంటికి పంతులు వస్తాడు. మీరు చెప్పిన గడియలో పుట్టిన పాపకి ఆరోగ్య సమస్య ఉంది. జాతకంలో కొన్ని దొషాలు ఉన్నాయి. శాంతి పూజ చెయ్యాలని పంతులు చెప్తాడు. అప్పుడే తులసి వస్తుంది. జాతకం బాగుంది అమ్మ కొంచం దోషం ఉంది పూజ చెయ్యాలని పంతులు చెప్తాడు. సరేనని తులసి లోపలికి వెళ్తుంది. మీరు పాపకి సమస్యలు ఉన్నాయని నా భార్య ముందు అనకండి అని పంతులుతో మినిస్టర్ చెప్తాడు. మరొకవైపు పాపని స్వప్నకి ఇచ్చి నేను నా పాప ఎక్కడ ఉందో కనుక్కోడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది కావ్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



