Karthika Deepam2 : స్పృహ తప్పి పడిపోయిన శివన్నారాయణ.. సుమిత్ర ఆచూకి తెలిసేనా!
on Oct 17, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -490 లో..... కార్తీక్, దశరథ్ ఇద్దరు సుమిత్రని వెతకడానికి వెళ్తారు. కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. అక్కడికి వస్తే కాల్ చెయ్యమని చెప్తాడు. సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం కాంచనకి శ్రీధర్ చెప్తాడు. దాంతో కాంచన షాక్ అవుతుంది.
మరొకవైపు సుమిత్ర గురించి దీప ఒకవైపు కార్తీక్, దశరథ్ ఇద్దరు ఒకవైపు వెతుకుతుంటారు. సుమిత్రని గుర్తుచేసుకొని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేసి తాతయ్య స్పృహ తప్పి పడిపోయాడని చెప్తుంది. దాంతో కార్తీక్, దశరథ్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. డాక్టర్ వస్తాడు. అయన ఏదో టెన్షన్ పెట్టుకున్నాడు.. అది దూరం చెయ్యమని డాక్టర్ చెప్తాడు. మరొకవైపు దీప ఒక అమ్మవారి గుడి దగ్గర ఆగుతుంది. తన బాధని చెప్పుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే పంతులు వచ్చి దీపకి ధైర్యం వచ్చేలా మాట్లాడతాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఆ బాధ తొలగిపోతుంది దైర్యంగా వెళ్ళమని దీపతో పంతులు చెప్తాడు.
శివన్నారాయణ దగ్గరికి కాంచన, శ్రీధర్ వస్తారు. తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసి కాంచన ఏడుస్తుంది. అసలు మీ అమ్మ వెళ్తుంటే ఆపకుండా ఏం చేసావని జ్యోత్స్నని పారిజాతాన్ని కాంచన తిడుతుంది. శివన్నారాయణ స్పృహలోకి వచ్చి సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



