Karthika Deepam2 : షూట్ చేసింది దీపే అని చెప్పేసిన దశరథ్.. సంతోషంలో జ్యోత్స్న, పారిజాతం!
on Apr 22, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో..... దీప దగ్గరికి కార్తీక్ భోజనం తీసుకొని వస్తాడు. మీరు అక్కడ పెట్టేసి వెళ్లిపోండి.. ఎస్ఐ గారు వస్తారని కానిస్టేబుల్ అంటుంది. నా భార్యకి నేను భోజనం తినిపిస్తానని కార్తీక్ అంటాడు. మీ ఆవిడకి ఆకలిగా లేదట అని కానిస్టేబుల్ అంటుంది. కన్నకూతురు కడుపునిండా తింది.. అక్కడ హాస్పిటల్ లో మావయ్య స్పృహలోకి వచ్చాడు.. ఇప్పుడు ఆకలి అవుతుందని కార్తీక్ అంటాడు. దీప నీ కోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీపకి కార్తీక్ భోజనం తినిపిస్తాడు.
కాసేపటికి ఎస్ఐ వస్తాడు. అతన్ని లోపలికి ఎందుకు రానిచ్చావని కానిస్టేబుల్ ని ఎస్ఐ అడుగుతాడు. దశరథ్ గారు స్పృహలోకి వచ్చారు ఇక బయటకు వస్తాను అనుకుంటున్నావేమో కానీ ఇప్పుడు దశరథ్ గారు దీప షూట్ చేసిందని చెప్తే నీకు శిక్ష తప్పదు.. ఇక మీ అయన నీకు భోజనం తీసుకొని రావల్సిన అవసరం లేదు.. జైల్లో పెడుతారని ఎస్ఐ దీప, కార్తీక్ లతో అంటాడు. ఆ తర్వాత ఎస్ఐ హాస్పిటల్ కి వచ్చి దశరథ్ ని కలిసి.. మిమ్మల్ని షూట్ చేసింది ఎవరని అడుగుతాడు దశరత్ కాసేపు సైలెంట్ గా ఉంటాడు. దీప షూట్ చేసిందని చెప్పు.. ఆ దీప బయటకు రాకూడదని శివన్నారాయణ అంటాడు. దాంతో షూట్ చేసింది దీప అని దశరథ్ చెప్పి సంతకం పెడతాడు.
దాంతో పారిజాతం, జ్యోత్స్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనొక దగ్గరికి వెళ్ళాలని జ్యోత్స్న బయల్దేర్తుంది. కార్తీక్ బయటకు వెళ్తుంటే బయట శౌర్య బొమ్మతో మాట్లాడుతుంది. కార్తీక్ తన దగ్గరికి వచ్చి.. శౌర్యతో దీప మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ వినిపిస్తాడు. అది విని శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. శౌర్యని కార్తీక్ లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



