Karthika Deepam2 : దీపని చంపాలనుకున్న జ్యోత్స్న.. చెట్టుకి ఢీ.. తలకి గాయం!
on Dec 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -219 లో... దీపకి తెలియకుండా శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు కార్తీక్. కానీ దీప కూడా కార్తీక్ తో హాస్పిటల్ కి వెళ్తుంది. దీప, కార్తీక్ లు హాస్పిటల్ కి రావడం చూసిన జ్యోత్స్న కోపంతో ఉంటుంది. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అప్పుడే దీపకి ఎవరో చేసినట్టుగా జ్యోత్స్న గొంతు మర్చి ఫోన్ చేస్తుంది. సరిగ్గా వినపడకపోవడంతో అప్ప్పుడే కార్తీక్ వచ్చి సిగ్నల్ లేనట్టుంది బయటకు వెళ్లి మాట్లాడమని అనగానే దీప వెళ్తుంది. దాంతో శౌర్యని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్.
దీప బయటకు వెళ్లి మాట్లాడుతుంటే తను రావడం చూసి జ్యోత్స్న కార్ తో డాష్ ఇవ్వాలి అనుకొని వస్తుంది. దాంతో అప్పుడే దాస్ అక్కడ ఉంటాడు. దీప అని గట్టిగా అరవడంతో దీప పక్కకు అవుతుంది. జ్యోత్స్న చెట్టుకి డాష్ ఇచ్చి తలకి గాయం అవుతుంది. తనని చూసిన దాస్ అంటే నా కూతురు అసలైన వారసురాలిని చంపాలనుకుందా అని దాస్ అనుకుంటాడు. ఇక జ్యోత్స్నని దాస్, దీప లు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు.
మరొకవైపు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ తో కార్తీక్ మాట్లాడుతాడు. శౌర్య గురించి అడుగగా పాపకి ప్రాబ్లమ్ ఉంది. తనని ఇబ్బంది పెట్టె విషయాలు చెప్పొద్దని అంటాడు. దాంతో కార్తీక్ కంగారు పడతాడు. మరొకవైపు శివన్నారాయణకి దీప ఫోన్ చేసి జ్యోత్స్న కి దెబ్బ తగిలిందని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్, శౌర్యలకి జరిగింది మొత్తం దీప చెప్తుంది. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. నా మనవరాలిని ఏం చేశారంటూ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read