Karthika Deepam2 : దాస్ కి గతం గుర్తొంచిందని చెప్పేసిన దీప.. కాశీ ఏం చేస్తున్నాడంటే!
on Jul 16, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -410 లో... మా వదినకి కుంకుమ పెట్టు దీప అని కాంచన అనగానే.. వద్దని సుమిత్ర అంటుంది. అయితే మీరు ఇచ్చిన తాంబూలం తీసుకొని వెళ్ళండి అని కాంచన అంటుంది. తప్పక సుమిత్ర దీపతో బొట్టు పెట్టించుకుంటుంది. ఆ తర్వాత తప్పకుండా ఎంగేజ్ మెంట్ కి రావాలని దశరథ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు కాశీకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ స్వప్న లిఫ్ట్ చేస్తుంది. నువ్వెందుకు చేసావని జ్యోత్స్నపై స్వప్న కోప్పడుతుంది. అప్పుడే కాశీ వచ్చి ఫోన్ లాక్కొని బయటకు వెళ్లి మాట్లాడతాడు. దాంతో స్వప్నకి డౌట్ వస్తుంది.
ఆ తర్వాత కార్తీక్ కి దీప పాలు తీసుకొని వస్తుంది. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పకుంటారు. మరుసటి రోజు ఉదయం కాంచన, శౌర్య దేవుడికి మొక్కుకుంటారు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కదా ఏమైనా తీసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఎంగేజ్ మెంట్ కి నేను వెళ్తానని నీతో చెప్పానా అక్కడికి వెళ్తే అవమానం తప్ప ఏముండదని కాంచన అంటుంది. దాంతో ఎలాగైనా ఎంగేజ్ మెంట్ కి రావడానికి అత్తయ్యని ఒప్పించమని అనసూయకి దీప సైగ చేస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్నని కలవడానికి కాశీ వస్తాడు. కాశీ వచ్చి జ్యోత్స్నతో మాట్లాడడం దీప చూసి కార్తీక్ కి చూపిస్తుంది.
ఆ తర్వాత అసలు కాశీ ఎందుకు కలిసాడని స్వప్నకి ఫోన్ చేస్తాడు కార్తీక్. స్వప్న పది లక్షల అప్పు గురించి చెప్తుంది. అలాగే జ్యోత్స్న ఫోన్ చేసి కాశీతో మాట్లాడిందని చెప్తుంది. సరే నేను చెప్పినట్టు చెయ్ అని కార్తీక్ స్వప్నకి ఏదో చెప్తాడు. ఆ తర్వాత నువ్వు కూడా ఇలా చెయ్ అని దీపతో ఏదో చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత దీప కావాలనే జ్యోత్స్న దగ్గరికి వచ్చి.. కాశీ ఇంటికి వచ్చాడట బావ కానీ మనల్ని కలవలేదని అంటుంది. దాంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. మీరేమైన చూసారా మేడమ్ అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. స్థాయి తక్కువ వాళ్ల గురించి పట్టించుకోనని జ్యోత్స్న అనగానే కానీ అవసరానికి వాడుకుంటారని దీప అంటుంది. దాస్ బాబాయ్ కి ఇంట్లో నుండి వెళ్లిపోయే ముందు గతం గుర్తు వచ్చిందట అని దీప అనగానే.. జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



