Karthika Deepam2: వారిద్దరిని ఏకిపారేసిన శివన్నారాయణ.. దీప ఆ సాక్ష్యాలు సేకరిస్తుందా!
on Apr 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-319 లో.. జ్యోత్స్న తన యాక్టింగ్ తో దశరథ్, పారిజాతం, సుమిత్రల సింపథీ పొందుతుంది. దీప రాత్రి అయిన అన్నం తినదు. అది తెలుసుకున్న కార్తీక్.. అన్నం కలిపి తీసుకొస్తాడు. దీపా.. ఈ పచ్చడి ఎలా ఉందో రుచి చూసి చెప్పు.. అనసూయగారు చేశారంటూ కలిపి ముద్ద పెట్టడానికి ట్రై చేస్తాడు. ఏంటి దీపా ఆలోచిస్తున్నావ్? చేతులు ఖాళీగా లేవనా? భార్యభర్తల్లో ఎవరో ఒకరి చేతులు ఖాళీగా ఉంటే చాలు.. మరొకరి ఆకలి తీర్చడానికి.. తిను దీపా.. నిన్ను ఏం ఇబ్బంది పెట్టను.. తినేసి నువ్వు శౌర్య బట్టలు ఇస్త్రీ చేసుకోమని కార్తీక్ అంటాడు. నాకిప్పుడు ఆకలిగాలేదు బాబు అని దీప అంటుంది. బాధ, ఆకలి రెండు శత్రువులు దీపా.. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండదు.. బాధను తీసెయ్.. ఆకలి తెలుస్తుందని కార్తీక్ అంటాడు. బాధ ఎందుకని దీప అంటుంది. నేను అదే అడుగుతున్నా బాధ ఎందుకు అని కార్తీక్ అంటాడు. గౌతమ్ మంచివాడు.. వాడు జ్యోత్స్న భర్త అయితే ఏమైపోతుందో నాకు తెలుసు.. సాక్ష్యాలు కావాలంటే ప్రతిదానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేనేదో కావాలని జ్యోత్స్న మీద పగ బట్టినట్లు మాట్లాడుతున్నారంటూ దీప తన మనసులోని బాధ చెప్పుకుంటుంది.
మేము బాగానే ఉన్నాం కాశీ అంటు కాశీతో దీప, కార్తీక్ నవ్వుతూనే మాట్లాడతారు. దీపా నీ వంటలన్నీ కాశీకి రుచి చూపించు.. నేను కస్టమర్స్‌ని చూసుకుంటానని ఒక్కొక్కరిని ఏం కావాలని మెను పట్టుకుని వెళ్లి అడుగుతూ ఓ పెద్దాయన ముందు మెను కార్డ్ పెడతాడు కార్తీక్. కాస్త విషం కావాలని పైకి లేస్తాడు ఆ పెద్దాయన. అతడు ఎవరో కాదు శివనారాయణే. అది చూసి దీప, కాశీ పరుగున అక్కడికి వెళ్తారు. ఇక శివనారాయణ.. కార్తీక్‌ని దీపని.. మధ్యలో మాటలకు అడ్డొచ్చిన కాశీని ఏకిపారేస్తుంటాడు. తినడానికి వచ్చిన వాళ్లంతా వినోదం చేస్తారు. దీపని శివన్నారాయణ ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి వెళ్లిపోయాక ఏడ్చుకుంటూ దీప అక్కడి నుండి వెళ్తుంది. కార్తీక్ తనకోసం హోటల్ అంతా వెతికినా ఎక్కడ కనపడదు.
మేనేజర్ ని కార్తీక్ పిలుస్తాడు. దీప గారిని చూశావా అని కార్తీక్ అంటాడు. ఆవిడ వెళ్లిపోయారు సర్ అనడంతో.. ఇంటికి వెళ్లి ఉంటుందేమో అని కార్తీక్ అనుకుంటూ సరే నువ్వు చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అనేసి బయల్దేరతాడు. అయితే అప్పటికే దీప.. ఆవేశంగా, కన్నీళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ సుమిత్ర అన్న మాటలు, శివనారాయణ అన్న మాటలు తలుచుకుని ఓ చోటికి వెళ్తుంది. అక్కడ ఓ వాచ్ మెన్‌ని ఏవో వివరాలు అడుగుతుంది. ఆ సీన్‌కి మొత్తం మ్యూజిక్కే వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పేపర్ పట్టుకొని దీప రోడ్డు మీద వెళ్తుంటే ఒక కార్ తన ముందుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
