Karthika Deepam2 : గతం చెప్పేసిన కార్తీక్.. ప్రాణదాత తనే అని మురిసిపోయిన దీప!
on Jan 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -245 లో..... కార్తీక్ తన జ్ఞాపకమైన లాకెట్ వెనకాలున్న గతం గురించి దీపకు చెప్తాడు. మేము చిన్నప్పుడు మా అత్తయ్యతో కలిసి ఒక గుడికి వెళ్ళాం.. అక్కడ కోనేరులో ఉన్న పువ్వు కావాలని అడిగింది జ్యోత్స్న. నాకు నీళ్లంటే భయమైన లోపలికి వెళ్ళాను.. నేను మునిగిపోతుంటే జ్యోత్స్న వదిలేసి వెళ్ళింది కానీ ఒక అమ్మాయి నన్ను కాపాడింది. నాకు ఇంకా గుర్తుంది.. నేను వెళ్తుంటే తన లాకెట్ నా జేబులో ఉంది. ఎప్పటికైనా తన ఋణం తీర్చుకుంటానని కార్తీక్ గతమంతా చెప్తాడు.
అది విన్న దీప అది నేనే అని మనసులో మురిసిపోతుంది. మిమ్మల్ని కాపాడింది నేనేనా.. అందుకే ఋణం తీర్చుకున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. కానీ తనే కాపాడిందని, ఆ లాకెట్ తనదేనని దీప చెప్పదు. నన్ను కాపాడిన అమ్మాయి ఏం అడిగిన ఇస్తాను.. ఒక ప్రాణం తప్ప.. ఎందుకంటే నా ప్రాణం నా భార్యది అని ఎమోషనల్ గా మాట్లాడతాడు కార్తీక్. ఆ తర్వాత శౌర్య వచ్చి లాకెట్ ఇవ్వమని అడుగగా.. నేను ఇవ్వనని శౌర్యని బుజ్జగిస్తాడు కార్తీక్. కాసేపటికి కార్తీక్ వెళ్ళిపోయాక.. మీరు ఎలా ఉండేవారు ఎలా అయ్యారు.. మీరు మీ తాతయ్య గారితో ఛాలెంజ్ చేశారు.. మీరు నేను కోరుకున్న విధంగా ఉన్నప్పుడు.. మీ ప్రాణదాత నేనే అని చెప్తాను. అప్పటివరకు చెప్పనని దీప అనుకుంటుంది.
ఆ తర్వాత దీప, కార్తీక్ లు టిఫిన్ కి అవసరమయ్యే సరుకులు తీసుకొని వస్తుంటారు. నేను పట్టుకుంటానని దీప అనగానే.. ఇది కూడా మోయ్యాలేననుకున్నావా అని కార్తీక్ అంటాడు. అప్పుడే పారిజాతం వచ్చి విజిల్ వేస్తుంది. ఏం సీన్ అంటూ నవ్వుకుంటుంది. కార్తీక్ ని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది పారిజాతం. ఈ దీపతో ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది. అదొక నష్టజాతకురాలని దీపని తిడుతుంది పారిజాతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read