Karthika Deepam2 : అలమరాలో దొరికిన లాకెట్ తీసుకున్న దీప.. నిజం చెప్పేసిన కార్తీక్!
on Jan 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -244 లో.....ఒక పాప టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి.. డబ్బు లేదు. నాకు ఆకలిగా ఉంది. ఇంటి దగ్గర అమ్మ ఉందనగానే దీపకి జాలి వేసి టిఫిన్ తనకి, తన అమ్మకి పంపిస్తుంది. ఆ తర్వాత ఒక తాగుబోతు వస్తాడు. అది తీసుకొని రా. ఇది తీసుకొని రా అంటూ దీపని ఇబ్బంది పెడతాడు. తీరా చూస్తే డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోతుంటాడు. అతడిని దీప డబ్బులు అడుగగా.. ఇవ్వడు. నా గురించి ఎక్కడైనా అడుగు..ఈ ఏరియా నాది అంటూ రుబాబుగా మాట్లాడతాడు.
ఆ తర్వాత రౌడీ కోపంగా బండిని పట్టుకుంటాడు. దాంతో దీప అతని చెయ్యి ఆపుతుంది. సివంగిలా రౌడీ అంతు చూస్తుంది దీప. తప్పు అయింది.. నా దగ్గర డబ్బు లెవ్వని రౌడీ అనగానే.. సరే వాచ్ ఇవ్వమని వాచ్ తీసుకుంటుంది. అది చూసిన కాంచన , కార్తీక్ లు దీప ధైర్యం చూసి మురిసిపోతారు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి తన మేనేజర్ వచ్చి రెస్టారెంట్ లాస్ లో ఉందని చెప్తాడు. అలా కాకుండా చూడాలి బావ లాంటి వాళ్ళ ముందు మాట పడాల్సి ఉంటుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన డబ్బులో నేను సగం తీసుకుంటానని కార్తీక్ అందులో నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. అది తీసుకొని దాచి పెడుతు ఇది మన కూతురు కోసం తీసాను దీప అని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్ డబ్బులు అలమరాలో పెట్టేటప్పుడు కార్తీక్ జ్ఞాపకమైన లాకెట్ కిందపడుతుంది. అది కార్తీక్ చూసుకోకుండా వెళ్ళిపోతాడు. కాసేపటికి అది శౌర్యా చూసి తీసుకుంటుంది. అప్పుడే దీప వచ్చి ఏంటని శౌర్యని అడుగుతుంది. బలవంతంగా శౌర్య దగ్గర నుండి లాకెట్ తీసుకొని చూస్తుంది దీప. అది చూసి షాక్ అవుతుంది. తన అమ్మ జ్ఞాపకమని గుర్తు చేసుకుంటుంది.
ఆ తర్వాత కార్తీక్ లాకెట్ గురించి వెతుక్కుంటూ ఉంటే.. అప్పుడే దీప వచ్చి.. ఇదేనా అని అడుగుతుంది. ఇది ఎక్కడిది మీకు ఎవరు ఇచ్చారు తెలుసుకోవాలని ఉందని దీప అనగానే.. కార్తీక్ చెప్తాను అంటాడు. ఇన్నిరోజులు ఈ విషయం చెప్పే అంతా సాన్నిహిత్యం రాలేదని కార్తీక్ అంటాడు. ఇక తనని చిన్నప్పుడు ఒక అమ్మాయి కొలనులో పడిపోతే కాపాడిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read