Karthika Deepam2 : కార్తీక్, దీపల కొత్త బిజినెస్.. జ్యోత్స్నలో మొదలైన కుళ్ళు!
on Dec 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -241 లో.... దీప టిఫిన్ సెంటర్ పెడుతుంది. పూజ చేస్తుంది. దానికి అందరు వస్తారు. టిఫిన్ సెంటర్ ఎవరి పేరునోనని చెప్పకుండా సర్ ప్రైజ్ అంటుంది. తీరా చూస్తే కార్తీక్ పేరు ఉంటుంది. అది చూసి మా అక్కకి బావ అంటే ఎంత ఇష్టమో టిఫిన్ సెంటర్ పేరు కూడా బావ పేరు పెట్టిందని కాశీ అంటాడు. కార్తీక్ ఉంటే బాగుండు వాడికి ఇష్టం లేకుండా ఇది చేస్తున్నామని అనుకుంటుండగా అప్పుడే కార్తీక్ మాస్ లుక్ లో ఎంట్రీ ఇస్తాడు. భుజాన వాటర్ టిన్ తో, లుంగీలో ఎంట్రీ ఇస్తాడు కార్తీక్ .
ఆ తర్వాత కార్తీక్ వాటర్ టిన్ తీసుకొని వస్తుంటే. అది చూసి అందరు షాక్ అవుతారు. మీరు వచ్చినందుకు చాలా థాంక్స్ అని దీప అనగానే.. టిఫిన్ సెంటర్ నా పేరు నా పెట్టినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటానని కార్తీక్ అంటాడు. అమ్మ నువ్వు మొదట బోణి చెయ్ అంటూ తనకి కార్తీక్ ముందుగా టిఫిన్ ఇస్తాడు. ఆ తర్వాత అందరికి టిఫిన్ ఇస్తాడు. అందరూ బాగుందని అంటారు. అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామంటూ కాశీ ఫోటో తీస్తాడు.
మరొకవైపు జ్యోత్స్న డిజైన్స్ వేస్తుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పగానే పారిజాతం చూస్తుంది. కాశీ గాడు ఫోటో పంపాడని కార్తీక్, దీప లతో టిఫిన్ సెంటర్ దగ్గరున్న ఫోటోని పంపిస్తాడు. అది చూసి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అక్కడికి టిఫిన్ చెయ్యడానికి వెళదామంటూ పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది. ఇక జ్యోత్స్న ఎప్పటిలాగే కార్తీక్ ని ఆ స్టైల్ లో చూసి రెస్టారెంట్ ఓనర్ ని టిఫిన్ సెంటర్ ఓనర్ లాగా చేసావ్ కదనే అని దీపను తిడుతుంది. పారిజాతం ఫోటో తీసుకుంటుంటే.. ఇంకా బాగా తీసుకోమంటూ కార్తీక్ స్టిల్స్ ఇస్తుంటాడు. ఏదో చేస్తానని వచ్చావ్ కదా అని జ్యోత్స్నతో పారిజాతం అనగానే.. బావ చూసావా ఎంత హ్యాపీగా ఉన్నాడో.. ఏం చెయ్యాలి ఇక అంటూ జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read