Karthika Deepam2: దీపని చంపడానికి జ్యోత్స్న కొత్త నాటకం.. శివన్నారాయణనే పావుగా వాడుకుందిగా!
on Dec 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-221 లో.. కార్తీక్ ఫోన్ నుండి పారిజాతానికి కాల్ చేస్తాడు. ఇక కాంచన మాట్లాడుతుంది. జ్యోత్స్నకి ఎలా ఉందని కాంచన అడుగగా..దీప, కార్తీక్ ల గురించి పారిజాతం మాట్లాడుతుంది. జ్యోత్స్న బానే ఉందంట కదా అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు జ్యోత్స్న ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటుంది. జ్యోత్స్న ఒంటరిగా ఉండటం చూసిన శివన్నారాయణ తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు.
ఇంత ఆస్తి కూడబెట్టింది నీకోసమే అమ్మా.. అలాంటిది నువ్వే సంతోషంగా లేకపోతే మా ఆశలకు విలువేముంది.. నేను నీకోసమే మీ బావతో పెళ్లికి ఒప్పుకున్నాను కానీ వాడే మనల్ని మోసం చేశాడని శివన్నారాయణ అంటాడు. మనం దేన్ని సరిచేయలేం తాతా.. అయినా నేనేం నాకు బావ కావాలని అడగలేదు కదా తాతా అని జ్యోత్స్న అంటుంది. సరే నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శివన్నారాయణ అంటాడు. అయితే అటుగా వెళ్తున్న పారిజాతం.. ఆగి వారి మాటలను దూరంగా వినడం మొదలుపెడుతుంది. ఏమో తాతా.. నేను డిజైన్ చేసుకున్న లైఫ్ పాడైందని అర్థమయ్యాక.. నాకు ఏదో ఒంటరైపోయిన ఫీలింగ్.. నా చుట్టూ ఎవరూ లేరు.. నాకోసం ఎవరూ లేరు అనిపిస్తోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనిపిస్తోందంటూ జ్యోత్స్న కన్నీళ్లతో చెప్తుంది. పోనీ నీ చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి అనుకుంటున్నావ్.. ఎలా ఉంటుంటే బాగుంటుంది అనుకుంటున్నావని శివన్నారాయణ అడుగగా.. ఇది వరకూ నువ్వు, నేను, గ్రానీ, అత్తా బావా, మావయ్యా, అమ్మా, నాన్నా అంతా ఉండేవాళ్లు.. ఎప్పుడు ఏదో ఒక సందడి.. ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ అంటు జ్యోత్స్న చెప్తుంటే పారిజాతం కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి.
ఆ సందడి ఆ సంతోషం మన ఇంటికి వదిలి దూరంగా పోయింది తాతా.. నువ్వు మళ్లీ తీసుకుని రాగలవా.. కానీ అడగను తాతయ్య అది జరగదని నాకు తెలుసని జ్యోత్స్న కన్నీళ్లతో వెళ్లిపోతుంది. బాగా ఆలోచించిన శివన్నారాయణ.. కాంచన దగ్గరికి వస్తాడు. నా కోసం ఒక పని చెయ్యాలి కాంచనా.. నా మనవరాలు మీ అందరి కోసం బాగా బెంగ పెట్టుకుంది.. వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అని శివన్నారాయణ అంటాడు. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు తాతా? మీకు మళ్లీ కోపాలు గుర్తొచ్చే వరకా? ఆ రోజు నేను మీ గుమ్మం ముందు నిలబడి మా అమ్మను క్షమించమని అడిగాను.. విల్లేదని అన్నారంటూ కార్తీక్ జరిగినవన్నీ గుర్తుచేస్తాడు. ఇక కార్తీక్ ని కాంచన ఆపి.. వస్తాం నాన్న అని అంటుంది. అందరు అంటే మీరిద్దరే అని శివన్నారాయణ అనగానే.. ఏంటి తాతా నువ్వు మాట్లాడేది? అసలు దీప ఏం తప్పు చేసింది.. ఈ దీపే ఒకప్పుడు నీ కోడల్ని కాపాడింది. నిన్న కాక మొన్న నీ మనవరాలిని కాపాడిందంటూ ప్రతిదీ గుర్తు చేస్తాడు. అయితే శివనారాయణ తగ్గకుండా కోపంగా మాటలు అంటాడు. నాకు పెళ్లి అయ్యింది. దీప నా భార్య.. శౌర్య నా కూతురు అంటూ దీపను భుజానికి హత్తుకుని శివన్నారాయణతో కార్తీక్ మాట్లాడుతుంటాడు. అప్పటిదాకా భయం భయంగా.. దీపను పంపేస్తారా అని చూస్తున్న అనసూయ చాలా సంతోషిస్తుంది. శివనారయాణ మాత్రం రగిలిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read