Karthika Deepam2 : ఆ రిపోర్ట్స్ లో ఏం ఉందంటే.. కార్తీక్ షాక్!
on Dec 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -218 లో.... దాస్ ని దీప అసలైన వారసురాలన్న నిజం ఎవరికి చెప్పకని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చెయ్యడంతో.. నా నోటితో నిజం చెప్పను కానీ అలాగని దీపకి అన్యాయం చెయ్యనని దాస్ అంటాడు. ఏం చేస్తావని జ్యోత్స్న అడిగేలోపే దాస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నువ్వు న్యాయం చేసేలోపు నేనే ఆ దీపని పైకి పంపిస్తానని జ్యోత్స్న అనుకుంటుంది.
ఆ తర్వాత శౌర్య స్కూల్ వెళ్ళనంటుంటే అప్పుడే కార్తీక్ వచ్చి శౌర్య పైకి కోప్పడతాడు. స్కూల్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని కార్తీక్ అంటాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి శౌర్య రిపోర్ట్స్ వచ్చాయని అంటాడు. శౌర్యని తీసుకొని హాస్పిటల్ రా అని డాక్టర్ అంటాడు. దాంతో సరే శౌర్యా ఈ రోజు స్కూల్ కి వెళ్ళకు హాస్పిటల్ కి వెళదాం.. నాకు తలనొప్పిగా ఉంది. దాంతో శౌర్యకి చెకప్ చేయించి తీసుకొని వస్తానని కార్తీక్ అనగానే నేను కూడా వస్తానని దీప అంటుంది. దీపని ఎలాగైనా ఆపాలని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఒకవేళ అసలైన వారసురాలు వస్తే ఏం చేస్తావని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. అది రాదని పారిజాతం అంటుంది.
వచ్చింది కానీ నీకు చెప్పిన వేస్ట్ అని జ్యోత్స్న అనుకొని.. దీప అసలైన వారసురాలన్న విషయం చెప్పదు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎందుకు రాత్రి పడుకోనట్టు ఉన్నావని జ్యోత్స్నని అడుగగా.. బావ వర్క్ పై దృష్టి పెట్టట్లేదని అంటుంది. ఒకసారి చెప్పి చూడు ఆ తర్వాత నేను చూసుకుంటానని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు దీప చూడకుండా శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. కానీ దీప ఆల్రెడీ కార్ లో వచ్చి కూర్చొని ఉంటుంది. ఎలా మ్యానేజ్ చెయ్యాలని కార్తీక్ టెన్షన్ పడతాడు. కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. వెనకాలే జ్యోత్స్న కూడా వస్తుంది. డాక్టర్ దగ్గర కి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండమని దీపతో అంటాడు. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళ్లి శౌర్య వాళ్ళ అమ్మ కూడా వచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read