Karthika Deepam2 : భర్తతో బంధం తెంచుకున్న భార్య.. ఇప్పుడు కొడుకే ఆధారమా!
on Oct 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -166 లో.....కార్తీక్ అన్న మాటలు శ్రీధర్ గుర్తుచేసుకుంటాడు. అప్పుడే కావేరి కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని కావేరి అంటుంది. నాకు ఇలా జరిగిందని ఏం బాధ లేదా అని శ్రీధర్ అంటాడు. మన గురించి ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే కదా అదేదో ఇప్పుడు తెలిసిందని కావేరి అంటుంది. ఇన్ని రోజులు ఇక్కడ మూడు రోజులు అక్కడ, నాలుగు రోజులు ఉండేవాడివి.. ఇప్పుడు ఇక్కడే ఉంటావని కావేరి అంటుంది.
నాకు నా కుటుంబం దూరం అయిందని శ్రీధర్ అనగానే.. అంటే ఇది కుటుంబం కాదా అని కావేరి తన మనసులో బాధని బయటపెడుతుంది. మీరు వద్దనుకోలేదు.. వాళ్లే వద్దని అనుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన కూతురు గురించి.. రెడీ అవ్వండి వెళదామని శ్రీధర్ కి కావేరి చెప్తుంది. మరొకవైపు శివన్నారాయణ దగ్గరికి కార్తీక్ వస్తాడు. తాతయ్యతో మాట్లాడాలని కార్తీక్ అనగానే.. ఏం మాట్లాడాలని శివన్నారాయణ అంటాడు. నా తల్లికి ఎందుకు అన్యాయం చేశారు.. తప్పు చేసింది నా తండ్రి అయితే నా తల్లికి ఎందుకు శిక్ష.. ఇదెక్కడి న్యాయం అంటూ తల్లిని దూరం పెట్టడం గురించి మాట్లాడతాడు. మీరు మీ కూతురితో బంధం తెంపుకునే కంటే ముందే.. మా అమ్మ ఆయనతో బంధం తెచ్చుకుంది. నాన్నని తన రెండవ భార్యని పిలిచి చీర పెట్టి తన భర్తను కూడా అప్పగించిందని కార్తీక్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. మీరే కదా మా అమ్మకి పెళ్లి చేసింది. ఇప్పుడు మా అమ్మకి అన్యాయం జరిగిందని ఎవరిని అడగాలంటూ శివన్నారాయణతో కార్తీక్ అనగానే.. తప్పు ఎవరు చేసిన తప్పే అని మొండిగా ఉంటాడు శివన్నారాయణ. నా తల్లికి నేనున్నానని కార్తీక్ వెళ్లి పోతుంటే.. బావ అంటూ జ్యోత్స్న పిలుస్తుంది. అలా పిలవచ్చో లేదో మీ తాతయ్యని అడుగమని చెప్పి కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు దీపకి స్వప్న ఫోన్ చేసి.. ఇక్కడ ఎవరు లేరు.. నా కోసం ఎవరో ఒకరు రావాలి కదా.. ఇంతవరకు ఎవరు రాలేదు.. అన్నయ్యని చూడాలని ఉందంటూ మాట్లాడుతుంది.
ఆ తర్వాత కార్తీక్ వెళ్తుంటే దీప ఆపుతుంది. లోపల మీ తాతయ్య ఏం అన్నారని అడుగుతుంది. క్షమించలేనని అన్నారని కార్తీక్ అంటడు. స్వప్న ఫోన్ చేసింది. మిమ్మల్ని చూడాలని ఉందని అంటుందని దీప అనగానే.. నా తల్లి ఇంట్లో ఒక్కతే ఉందంటు కార్తీక్ వెళ్తాడు. ఏంటి సమాధానం చెప్పలేదని దీప అనుకుంటుంది. ఆ తర్వాత పారిజాతానికి దాస్ ఫోన్ చేస్తాడు. నీ కొడుకు ఎందుకు ఇలా చేసాడంటు పారిజాతం తిడుతుంది కాశీతో కూడా అలాగే కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు బావ అంత మాట్లాడాడు కానీ నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అసలు బావ మనసులో నేనున్నానా అని జ్యోత్స్న అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read