Karthika Deepam 2: కార్తీక్ కి నిజం చెప్పేసిన కాశీ.. జ్యోత్స్న షాక్!
on Dec 30, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -553 లో.... జ్యోత్స్న గదిలోకి దీప వెళ్ళిందని పారిజాతం చెప్పగానే జ్యోత్స్నకి భయం వేసి తన గదిలోకి వెళ్తుంది. కానీ జ్యోత్స్న వచ్చేలోపే దీప వెళ్లి తన రూమ్ లో రికార్డర్ పెట్టి వెళ్తుంది. జ్యోత్స్న వచ్చి ఎవరు లేరు కదా.. బావ మాటల్లో ఏదో తేడా కనపడింది.. ఇదంతా ఏంటి.. నా గురించి బావకి తెలిసిందా అని జ్యోత్స్న భయంతో వైరాకి కాల్ చేస్తుంది. అప్పుడే ఫోన్ రికార్డింగ్ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది.
వైరా మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న రికార్డింగ్ అవుతున్న విషయం గమనించి వైరా ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతుంది. మీరు నాకు ఎందుకు కాల్ చేశారు.. నేను ఇప్పుడు సీఈఓగా లేకపోవచ్చు కానీ ఎప్పుడు రెస్టారెంట్ ని పైనే ఉంచుతానని మాట్లాడుతుంది. ఆ మాటలకి వైరా షాక్ అవుతాడు. ఇలా హ్యాండ్ ఇచ్చింది ఏంటని అనుకుంటాడు.
ఆ తర్వాత దీప వెళ్లి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంటే.. ఏంటి నా గదిలో నుండి వస్తున్నావని జ్యోత్స్న ఏం తెలియనట్లే మాట్లాడుతుంది. దీప అక్కడ నుండి వెళ్లి కార్తీక్ కి ఫోన్ ఇస్తుంది. ఇదంతా జ్యోత్స్న ఫోన్ రికార్డింగ్ చూసి మాట్లాడినట్లు అనిపిస్తుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది.
ఆ తర్వాత కాశీ దగ్గరికి కార్తీక్ వెళ్లి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలి. తన పేరు వైరా అని కార్తీక్ అనగానే కాశీ భయపడుతాడు. కార్తీక్ తన చెంపచెల్లుమనిపిస్తాడు. ఇదంతా మా నాన్నపై కోపంతో చేసావ్.. ఇలా చెయ్యమని ఆఫర్ ఇచ్చింది జ్యోత్స్న కదా అని అనగానే అవునని కాశీ అంటాడు. నన్నేం చేయమంటావ్ నన్ను మనిషిగా కూడా మీరు ఎవరు చూడడం లేదని కాశీ అంటాడు. ఇప్పుడు మనం ఆ వైరా దగ్గరికి వెళ్ళాలని కార్తీక్ తనని తీసుకొని వెళ్తాడు.
మరొకవైపు దశరత్, సుమిత్ర గురించి బాధపడుతుంటే అమ్మగారికి ఏం కాదని దీప దైర్యం చెప్తుంటే ఒక క్షణం జ్యోత్స్న వచ్చిందనుకుంటాడు. నువ్వు నా కూతురు అయితే ఎంత బాగుండు అని దీపతో దశరథ్ అనగానే నేను మీ కూతురునే నాన్న అని తన మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



