Karthika Deepam 2 : వంటల్లో పాయిజన్ కలిపించిన జ్యోత్స్న.. దీప కనిపెట్టగలదా!
on Mar 14, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -304 లో... గౌతమ్ తాను ప్రేమించిన అమ్మాయిని కడుపు తీయించుకోమని డబ్బులు విసిరేస్తుంటే.. దీప చూసి కోప్పడుతుంది. నీకు ఇది అవసరం లేని విషయమని గౌతమ్ దీపపై అరుస్తాడు. దాంతో దీప కోపంగా వెళ్ళిపోతుంది.
మరొకవైపు జ్యోత్స్న అయితే పెళ్లికి ఒప్పుకుంది కానీ ఇప్పుడు మన చేతుల్లో గౌతమ్ సంబంధం తప్ప మరేం లేదని శివన్నారాయణ అంటాడు. గౌతమ్ కూడా మంచివాడే అని అనుకుంటారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఏంటి అబ్బాయిని కలిసావా అని సుమిత్ర ఆత్రంగా అడుగుతుంటే.. లేదని జ్యోత్స్న చెప్తుంది. అందరు డిస్సాపాయింట్ అవుతారు. నేను కలవడమెందుకు మీరు అంతా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా.. ఇక నేనేందుకు చూడడం మీరు అన్ని ఎరేంజ్ చేసుకోండి.. నేను తల వంచుకొని తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న అనగానే.. అందరు హ్యాపీగా ఫీలవుతారు.
మరొకవైపు దీప గౌతమ్ ని గుర్తు చేసుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. జరిగింది మొత్తం దీప చెప్తుంది. నీకొక గుడ్ న్యూస్ విజయ్ కంపెనీ ఎప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్ కి ఆర్డర్ ఇచ్చేది.. ఇప్పుడు మనకి ఇచ్చిందని కార్తీక్ చెప్పగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు జ్యోత్స్న వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారోనని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. నీ అసమర్ధత వల్లే అన్నీ ఇలా మిస్ అవుతున్నాయంటూ కోప్పడతాడు. జ్యోత్స్న నీపై నాకు నమ్మకం ఉంది అన్ని వదిలేసి రెస్టారెంట్ పై దృష్టి పెట్టమని సుమిత్ర చెప్తుంది. ఇప్పుడు ఆ సత్యరాజ్ రెస్టారెంట్ పని అయిపోతుందని పారిజాతంతో జ్యోత్స్న మాట్లాడుతుంది.
మరొకవైపు విజయ్ కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్డర్స్ రెడీ చేసి తీసుకొని వెళ్తుంటారు. అక్కడ ఒక వెయిటర్ వంటల్లో ఏదో కలుపుతాడు. ఆ తర్వాత జ్యోత్స్నతో ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే దీప వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మా సిస్టర్ తో అని అతను చెప్తాడు. అన్ని వంటలు కంపెనీకి తీసుకొని వెళ్లి ఎంప్లాయిస్ కి సర్వ్ చేస్తారు. జ్యోత్స్న చాటు నుండి చూస్తూ ఫుడ్ పాయిజన్ అయి వాళ్ళు హాస్పిటల్ కి.. దీప బావలు స్టేషన్ కి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
