Karthika Deepam 2 : గతం చెప్పేసిన కార్తీక్.. ఆ నిజాన్ని దాస్ చెప్పగలడా!
on Dec 1, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -216 లో......దీపలో ఉందేంటి నాలో లేదేంటని కార్తీక్ తో జ్యోత్స్న అనగానే.. గుణం, మంచితనం అని దీప గురించి గొప్పగా మాట్లాడతాడు. నీకోసం నా ప్రాణం అయిన ఇస్తాను బావ అని జ్యోత్స్న అనగానే.. నువ్వు ఇస్తావా.. చిన్నప్పుడు నేను కొలను లో పడిపోతే నువ్వు వదిలేసి వెళ్ళావ్ కానీ ఒక అమ్మాయి వచ్చి ప్రాణం కాపాడిందని కార్తీక్ చెప్తాడు.
ఆ దీపని ఇక అడ్డు తొలిగించే పనిలో ఉంటానని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు అనసూయ కుబేర్ ఫోటో చూస్తూ.. నీకు దీప దొరికిందని దాస్ కి చెప్పాను.. ఎవరికి చెప్పొద్దూ అన్నావు కానీ చెప్పాను తమ్ముడు అని అనసూయ ఏడుస్తుంది. ఈ విషయం దీపకి తెలియొద్దని అనసూయ అనుకుంటుంది. ఏ విషయమంటూ కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన, దీప ఇద్దరు వస్తారు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని కార్తీక్ అంటాడు. దీప వాళ్ళ నాన్న చనిపోయింది నా వాళ్లే అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అవును నేను లండన్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని వెళ్లినప్పుడు మా కార్ తాకి పడొపోయాడు. దీప దీప అన్నాడని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. దీప అసలు నిజం తెలుసుకుంది. ఎలాగైనా దీపకి సాయం చెయ్యాలనుకున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత దీప అమ్మ నాన్న బతికే ఉన్నారని అనసూయ అంటుంది. ఏంటని దీప అనగానే అనసూయ డైవర్ట్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఉంటారని ఉదేశ్యలో అన్నానని అనసూయ అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి కోపంగా వెళ్తుంది.. అప్పుడే దాస్ పారిజాతం ఇంటికి వెళ్తాడు. ఎందుకు వచ్చావని శివన్నారయణ కోప్పడతాడు. దశరథ్ అన్న సుమిత్ర వదిన కోసం అని దాస్ అంటాడు. వాళ్లు లేరు అనగానే దాస్ వెళ్లిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



