ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళిన బ్రహ్మముడి కనకం!
on Jun 18, 2023

కనకం.. ఇప్పుడు స్టార్ మా టీవీ ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన క్యారెక్టర్. బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మ ముడి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీరియల్ మొదలై 125 ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మ రథం పడుతున్నారు.
ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. ఒక మధ్య తరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.
కనకం తాజాగా తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే తాజాగా "ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళామంటూ" ఒక వ్లాగ్ చేసింది కనకం(నీప శివ). అక్కడ అక్వేరియంలో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంది కనకం. అయితే తన యూట్యూబ్ ఛానెల్ ని సబ్ స్కైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్స్ చెప్పింది. అలాగే బ్రహ్మముడి సీరియల్ లో కనకం క్యారెక్టర్ ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది కనకం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



