Jayam serial : కుటుంబ పరువు కోసం ఆగిపోయిన రుద్ర.. అదే రోజున గంగ పెళ్ళి!
on Nov 14, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.....గంగ, రుద్ర ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంకా నా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని పైడిరాజు అంటాడు. అప్పుడే నేను చేసుకుంటానని మణి ఎంట్రీ ఇస్తాడు. ఇంత జరిగాక నీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని మణి అంటాడు. నా భార్య ఆరోగ్యం బాలేదు.. తను ఉండగానే గంగకి పెళ్లి చెయ్యాలని పైడిరాజు సెంటిమెంట్ గా మాట్లాడతాడు.
దాంతో మణితో పెళ్లి జరగడానికి లక్ష్మీ ఒప్పుకుంటుంది. ఈ పెళ్లి ఈ నెల 24 న ఫిక్స్ చేస్తున్నానని పైడిరాజు అంటాడు. ఆ రోజు వద్దు నాన్న.. నాకు ఆ రోజు మ్యాచ్ ఉందని గంగ అంటుంది. అయినా వాళ్ళ నాన్న వినిపించుకోడు. మరొకవైపు రుద్ర దగ్గరికి పారు వచ్చి.. ఆ గంగకి వాళ్ళ నాన్న మణి అనే అతనితో ఫిక్స్ చేసాడట.. ఇక మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పారు అంటుంది. మన పెళ్లి రోజే వాళ్ళ పెళ్లి అంట అని పారు చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. అదేంటి ఆరోజు మ్యాచ్ ఉంది కదా.. అలా ఎందుకు చేస్తుందని రుద్ర అంటాడు. మరొకవైపు గంగ ఏడుస్తుంది. అప్పుడే రుద్ర ఫోన్ చేసి ఆ మణిగాడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఇలా ఎలా చేస్తున్నావని రుద్ర అడుగుతాడు.
పైడిరాజు ఫోన్ లాక్కొని రుద్రతో ఫోన్ మాట్లాడుతాడు. ఇంకొకసారి ఇలా ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి గొడవ చేస్తానని రుద్రతో అంటాడు. ఆ తర్వాత రుద్ర దగ్గరికి శకుంతల వచ్చి.. ఈ కుటుంబం పరువు పోయాలే ఏం చెయ్యనని రుద్ర దగ్గర మాట తీసుకుంటుంది. ఆ తర్వాత శకుంతల వెళ్ళాక పెద్దసారు వచ్చి నువ్వు ఇప్పుడు గంగకి దగ్గర ఉండి కోచింగ్ ఇచ్చి పోటీలో గెలిచేలా చెయ్యాలని పెద్దసారు చెప్తాడు. పెద్దమ్మకి మాటిచ్చానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



