అందమైన ఔట్ఫిట్లో మెరిసిపోతున్న ఆటో!
on Jun 29, 2022
జబర్దస్త్ రాంప్రసాద్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ గా ఆడియన్స్ కి బాగా తెలుసు. గెటప్ శీను, సుధీర్, రాంప్రసాద్ మంచి ఫ్రెండ్స్ గా బాగా పరిచయం. జబర్దస్త్ అంటే వీళ్ళ ముగ్గురేనా అన్నట్టు సాగిపోయింది. తర్వాత ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు వెళ్లిపోయారు. రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో ఉండిపోయాడు. ఫ్రెండ్స్ అంతా విడిపోయేసరికి ఈ షోకి ఉన్న కళ కూడా బాగా తగ్గిపోయింది. రేటింగ్స్ కూడా పడిపోయాయి. ఐతే ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో ఆడియన్స్ తో సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. రాంప్రసాద్ కూడా అదే పనిలో ఉన్నాడు. మంచి మంచి ఔట్ ఫిట్స్ తో షూట్స్ చేయించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా ఒక ఫోటో రిలీజ్ చేసాడు. "ఈ ఆటోకి అందంగా డిజైన్ చేసింది" అనే కాప్షన్ పెట్టి సైడ్ లుక్ ఫోటో ఒకటి వదిలాడు. దానికి, "అర్హ.. థాంక్స్ ఫర్ అవుట్ ఫిట్" అని పోస్ట్ చేసాడు. 'సూపర్ బ్రో' అని ఒకరంటే, 'షూస్ కి సాక్స్ వేసుకోవడం మర్చిపోయావా' అంటూ ఒక నెటిజన్ క్రేజి కామెంట్ ని పోస్ట్ చేశారు. ఇలా ఈ అవుట్ ఫిట్స్ లో ట్రెండీగా కనిపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ లో ఎన్నో టీమ్స్ వచ్చాయి, వెళ్లాయి.. కానీ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ టీమ్ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో స్పెషల్ . ఎంతో టాలెంట్ ఉన్న వీళ్ళు కొత్త కొత్తగా స్కిట్స్ రాసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ముందుండేవాళ్లు. అందుకే ఈ టీమ్ ఈ షోలో ది బెస్ట్ టీమ్ గా పేరు సంపాదించుకుంది.
Also Read