ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ వినోద్ !
on Dec 10, 2022

చమ్మక్ చంద్ర టీమ్ లో జబర్దస్త్ వినోద్ లేడీ గెటప్స్ వేస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వినోద్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆడ వేషంలో కనిపిస్తూ అదరగొట్టే పంచులతో వినోదిని పేరుతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. చీర కడితే అచ్చం అమ్మాయిలా కనిపించేసరికి అందరూ మొదట్లో నిజంగా అమ్మాయే అనుకున్నారు. అబ్బాయి అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు..
ఇక ఇప్పుడు వినోద్ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. " రెగ్యులర్ జర్నీల కారణంగా, జంక్ ఫుడ్ కారణంగా హెల్త్ అంతా బాగా పాడైపోయింది..లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. జబర్దస్త్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంది. అభి, రాకేష్, రచ్చ రవి, చంద్ర అన్న అందరూ నాకు బాగా హెల్ప్ చేస్తారు. హాస్పిటలైజ్ ఐనప్పుడు చాలా బాగా కేరింగ్ గా చూసుకున్నారంతా.
ఇక కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యాక అవకాశం ఉంటే జబర్దస్త్ లో చేస్తాను లేదా మిగతా ఏదైనా చానెల్స్ లో ప్రసారమయ్యే షోస్ నుంచి ఏమన్నా ఆఫర్ వస్తే వెళ్లి చేస్తాను. ఇక రీసెంట్ గా "హౌస్ అరెస్ట్" "ఇందువదనా" "లంక" అనే మూవీస్ లో కూడా యాక్ట్ చేసాను. ఓన్లీ లేడీ గెటప్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. నా జీవితంలో వరస్ట్ డే అనేది ఏదైనా ఉంది అంటే మా నాన్న నా చేతుల్లో చనిపోయిన రోజు..అలాంటి రోజులు ఎప్పటికీ రాకూడదు " అని ఎన్నో విషయాలను చెప్పాడు వినోద్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



