ఇస్మార్ట్ జోడీ జోడి 3 ఫినిష్...టైటిల్ విన్నర్ ప్రేరణ - శ్రీపద్
on Mar 24, 2025
ఇస్మార్ట్ జోడీ జోడి సీజన్ 3 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ఇందులో రకరకాల టాస్కులు ఇచ్చి మరీ ట్విస్టులు ఇచ్చాడు యాంకర్ ఓంకార్. కూరగాయలు కట్ చేయించి వెయిట్ వేయించి కొంతమందిని ఎలిమినేట్ చేసాడు. ఇక ఫైనల్స్ కి శ్రీపద్ - ప్రేరణ, ఆదిరెడ్డి - కవిత వెళ్లారు. ఫైనల్ టాస్క్ లో ఆదిరెడ్డి జోడి ఓడిపోయింది. దాంతో శ్రీపద్ - ప్రేరణ జోడీ సీజన్ టైటిల్ గెలిచారు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆదిరెడ్డి - కవిత జోడి రన్నరప్ గా నిలిచారు. ఇక స్టేజి మీద ఆదిరెడ్డి ఇష్మార్ట్ జోడి మీద రివ్యూ చెప్పు అని ఓంకార్ అడిగేసరికి "వెరీ ట్రాన్స్పరెంట్ షో ఇది. ఈ షో చూడనివాళ్లే నెగటివ్ గా మాట్లాడతారు గాని లేదంటే ఎవరూ నెగటివ్ గా మాట్లాడరు..ఈ షోలో ఉన్న జంటల నుంచి చూసి ఏదో ఒక పాయింట్ ని జనాలంతా నేర్చుకుని ఉంటారు.
మాకు ఈ షో ద్వారా మంచి మెమోరీస్ ఇచ్చారు" అంటూ మంచి రివ్యూ ఇచ్చాడు. ఇక ప్రేరణ- శ్రీపద్ ఈ షో విన్నర్ అయ్యారు. ఇక అతి భారీ కప్ ని అలాగే 15 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందించాడు ఓంకార్. ఇక ఈ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం అన్ని జోడీస్ అని చెప్పాడు ఓంకార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి తమ్ముళ్లు, చెల్లెల్లు స్టార్ మా సపోర్ట్ ఉంది. ఎంతో ఇష్టంతో అందరూ ఈ ఎపిసోడ్స్ ఎడిట్ చేయడం వలనే సక్సెస్ ఫుల్ అయ్యింది. ఇక ప్రేరణ ఐతే తీన్మార్ స్టెప్పులేసింది. టైటిల్ గెలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పింది. అలాగే సర్టిఫికెట్ మీద తన పేరు చూసుకుని సంబరపడిపోయింది. అలాగే ఇక ప్రేరణ వాళ్ళ అమ్మ వచ్చి ఇప్పటి వరకు ఎలాంటి మ్యారేజ్ ఫొటోస్ లేవు అని షోలో ఇచ్చిన ఫోటో చాల బాగుందని చెప్పింది. ఇక ప్రేరణ ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా బాగా టాస్కులు ఆడింది దాంతో ఆ ఎక్స్పీరియెన్స్ ఇష్మార్ట్ జోడిలో బాగా ఉపయోగపడింది. ఇలా ఈ ఇష్మార్ట్ జోడి సీజన్ 3 పూర్తయ్యింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
