'ఇంట్లో దెయ్యం మాకేం భయం' అంటున్న కంటెస్టెంట్స్!
on Dec 9, 2022
.webp)
బిగ్ బాస్ లో గత నాలుగు రోజుల నుండి సాగుతోన్న ఫినాలే రేస్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో హౌస్ మేట్స్ చేసే ప్రతీ చిన్న తప్పు పెద్దదిగా చూపిస్తూ వస్తోన్నారు బిగ్ బాస్.
అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ లాస్ అయిన అమౌంట్ ని సంపాదించుకోవాడానికి టాస్క్ లు పెడుతూ వస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇందులో మొదటి టాస్క్ అయిన 'బాంబ్ డిఫ్యూజ్ వైర్' టాస్క్ లో ముగ్గురు పాల్గొన్నారు. "వీరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పగా, "ఇనయా గెలుస్తుంది" అని మిగిలిన సభ్యులు చెప్పారు. అయితే ఈ టాస్క్ లో శ్రీసత్య గెలిచింది.
ఆ తర్వాత ఇనయాని కన్ఫెషన్ రూంకి పిలిచాడు బిగ్ బాస్. ఇనయా వెళ్ళే ముందు హౌస్ మేట్స్ తో "నాకు భయమా, అసలు లేదు. పిల్లలు మీరు. వెళ్ళి పడుకోండి" అని చెప్పి, లోపలికి వెళ్ళింది. ఇక లోపలికి వెళ్ళాక అసలు హర్రర్ కథ చూపించాడు బిగ్ బాస్. ఆ సౌండ్స్ కి, గోస్ట్ మూవీని లైవ్ లో చూసిన ఫీలింగ్ ఇనయాకి కలిగిందనే చెప్పాలి. అంతలా భయపడింది. దెయ్యంని చూసినట్లుగా భయానికి లోనైంది ఇనయా. ఆ తర్వాత రేవంత్ కన్ఫెషన్ రూంకి వెళ్ళాడు. హర్రర్ డబుల్ డోస్ ని పరిచయం చేసాడు బిగ్ బాస్. మొత్తానికి హౌస్ లో ఒక మినీ హర్రర్ సినిమాని చూపించాడు బిగ్ బాస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



