Illu illalu pillalu : కొడుకుల మనసులో ఏం ఉందో తెలుసుకున్న తండ్రి.. ఏం చేయగలడు?
on Dec 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమావూతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -20 లో.....రామరాజు దగ్గరికి ప్రసాదరావు వెళ్లి.. మీ కొడుకులు మా ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఎంత దైర్యం ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోమంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో రామరాజు వీర ఆవేశంతో ఇంటికి వెళ్లి ఇద్దరి కొడుకులని చితక బాదుతాడు. మీరు నాకు తెలియకుండా ఇలా చేస్తున్నారంటూ కోప్పడతాడు.
ఏంటి రా మీ నాన్న చెప్పేది నిజమేనా అని వేదవతి.. ఇద్దరి కొడుకులని అసలేం జరిగిందని అడుగుతుంది. దాంతో సాగర్ ప్రేమ విషయం ఇంట్లో చెప్తాడు ధీరజ్. అంటే నాకు విలువ లేదా నాకు చెప్పాలిసిన అవసరం లేదా అంటూ రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇక మీదట అలాంటివి చెయ్యమని అందరు అంటారు కానీ ధీరజ్ మాత్రం మీరు కొడుకుల మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలని అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వాళ్ళ మామ వచ్చి.. ఇలా చేశారేంట్రా.. బావ ఎప్పుడు బాధ పడలేదు. ఈ రోజు బాధపడ్డారని అంటాడు. అదంతా ఎదురింట్లో ఉన్న ప్రేమ చూసి చెంపకి వాతలున్నాయంటూ ధీరజ్ ని ఏడిపిస్తుంది.
ఆ తర్వాత నర్మద ని తన పేరెంట్స్ తిడతారు. వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి ఇంకొకసారి ఇలాంటివి చెయ్యకంటూ వార్నింగ్ ఇస్తారు. మరొకవైపు వేదవతి గుడికి వెళ్లి ఏడుస్తుంటే.. ప్రేమ చూస్తుంది. వాళ్ళ నానమ్మకి చెప్తుంది. నీ చిన్న కూతరు ఎందుకు ఏడుస్తుంది కనుక్కో అంటుంది. తరువాయి భాగంలో నర్మద వచ్చి సాగర్ ని తిడుతుంది. ఇంత పిరికి వాడివి ఎందుకు ప్రేమించావని అంటుంది. దాంతో అతను కోపంగా రేపు మన పెళ్లి జరుగుతుందని మాటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read