Illu illalu pillalu : శ్రీవల్లిని జాబ్ చేయమన్న చందు.. కొడుకు కష్టాన్ని చూసి తండ్రి ఎమోషనల్!
on Jun 19, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -188 లో... ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం రామరాజుకి శ్రీవల్లి చెప్పిందని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. దాంతో ఇండైరెక్ట్ గా ఎవరు మావయ్యకి చెప్పారని శ్రీవల్లిని అడుగుతారు. నువ్వు గానీ చెప్పావా అక్క.. నిన్న మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళావటా అని నర్మద అంటుంది. నేను వేరొక రూట్ నుండి వెళ్ళాను.. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళలేదని శ్రీవల్లి అనగానే మేమ్ బ్యాంక్ కాలనీలో డాన్స్ నేర్పిస్తున్న విషయం నీకెలా తెలుసని నర్మద అనగానే శ్రీవల్లికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
ఎందుకు అక్క ఇలా ప్రతీ దాంట్లో కలుగజేసుకుంటున్నావని నర్మద, ప్రేమ కోప్పడతారు. నేను ఇంటికి పెద్ద కోడలిని అని శ్రీవల్లి అంటుంది. పెద్ద కోడలు అయితే ఇలా చేస్తారా బుద్ధి ఉండాలంటు ఇద్దరు శ్రీవల్లిని తిడతారు. ఇంకొకసారి మా విషయాలు పట్టించుకుంటే బాగోదంటూ ఇద్దరు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత నాకే వార్నింగ్ ఇస్తారా అని చందు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తుంది శ్రీవల్లి. ప్రేమ చాల మంచి అమ్మాయి అని చందు అనగానే శ్రీవల్లికి ఇంకా కోపం వస్తుంది. వాళ్ళిద్దరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు.. నువ్వు కూడా చదువుకున్నావ్ కదా అప్పుడు ఇవ్వన్నీ గొడవలు పట్టించుకోవని చందు అనగానే నేను ఒకటి అనుకుంటే ఒకటవుతుందేంటని శ్రీవల్లి అనుకుంటుంది.
ఆ తర్వాత రామరాజు, తిరుపతి బయటకు వెళ్తారు. అక్కడ ధీరజ్ ఫుడ్ డెలివరి చేస్తూ కన్పిస్తాడు. ఆర్డర్ లేట్ అయిందని అతను తిడుతుంటే నా కొడుకేం పరిస్థితి వచ్చిందని రామరాజు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రామరాజుని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. తరువాయి భాగం లో.. ఏం చెయ్యకు మిల్ కి రా అని ధీరజ్ తో రామరాజు అనగానే.. రానని దీరజ్ చెప్తాడు. దాంతో ధీరజ్ ని రామరాజు కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



