Illu illalu pillalu : సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న కొడుకు.. వారి ఆశీర్వాదం తీసుకుంటాడా!
on Dec 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -26 లో.....నర్మద తన పేరెంట్స్ ని గుర్తుచేసుకొని పెళ్లి పీఠల మీద నుండి పక్కకి వచ్చి బాధపడుతుంటే.. ధీరజ్ వెళ్లి మీరేం బాధపడకండి. మిమ్మల్ని మా వాళ్ళకి దగ్గర చేస్తాను. సొంత కూతురులాగా చూసుకుంటారని నర్మదకి దైర్యం చెప్తాడు ధీరజ్. దిష్టి తగులుతుందని తన చెంపకి కాలుకి దిష్టి చుక్కపెడతాడు ధీరజ్. అలా చెయ్యడంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్లి పెళ్లి పీఠలపై కూర్చొని ఉంటుంది. తన బాధపోగొట్టినందుకు ధీరజ్ కి సాగర్ థాంక్స్ చెప్తాడు.
ఆ తర్వాత అప్పుడే ఆ గుడికి రామరాజు వేదవతిలు వస్తారు. చెంచలమ్మ బియ్యం బస్తాలు కావాలనడంతో అవి తీసుకొని వస్తారు. వాళ్ళని సాగర్ చూసి షాక్ అవుతాడు. అందరు రామరాజుని చుసీ టెన్షన్ పడుతారు. రామరాజు బియ్యం తీసుకొని అటు వైపే వెళ్తుంటే.. అందరు అక్కడ నుండి వెళ్లి దాక్కొంటారు. ఏంటి పంతులు గారు ఎవరు లేరని రామరాజు పంతులుని అడుగగా ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళకి తెలియకుండా అని పంతులు అనగానే.. మా కొడుకులు చాలా మంచివాళ్లు ఇలా ఎప్పటికి చెయ్యరని పంతులుకి రామరాజు తమ కొడుకుల గురించి గొప్పగా చెప్తుంటాడు.
ఆ తర్వాత రామరాజు దగ్గరికి చెంచలమ్మ వెళ్లి.. మీరు బస్తాలు మోయడం ఏంటని వేదవతి రామరాజులని లోపలికి తీసుకొని వెళ్తుంది. అటువైపు వెళ్తుంటే సాగర్ వాళ్ళు వచ్చి పెళ్లి త్వరగా చెయ్యమని పంతులు దగ్గరికి వస్తారు. ఒకవైపు సామూహిక వివాహాలు జరుగుతుంటే మరొకవైపు సాగర్, నర్మదల పెళ్లి జరుగుతుంది. అప్పుడే సాగర్ కి ఫోన్ చేస్తుంది వేదవతి. భయంగా సాగర్ లిఫ్ట్ చేస్తాడు. తరువాయి భాగంలో సాగర్, నర్మదలు పెళ్లి చేసుకుంటారు. మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వారిని రామరాజు, వేదవతిలు ఆశీర్వాదిస్తుంటారు. ఇక్కడ మనం ఎక్కువసేపు వద్దని సాగర్ అంటాడు. మనం కూడా అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అంటుంది. వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read