Illu illalu pillalu : నర్మద, సాగర్ ల ప్రేమ పెళ్ళికి రామరాజు ఆశీస్సులు.. అసలు నిజం అదే!
on Dec 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -22 లో... సాగర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో నర్మద డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. దాంతో కంగారుగా సాగర్ బయటకు వచ్చి.. నర్మదతో మాట్లాడతాడు. ఇప్పుడైనా వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. మీ వాళ్ళని తీసుకొని వచ్చి మా వాళ్ళతో మాట్లాడమంటే నీకు అర్థం కాదా అని నర్మద కోప్పడుతుంటే.. మా నాన్న అంటే భయమని సాగర్ అంటాడు. అంత భయపడేవాడివి ఎందుకు ప్రేమించావు.. నువ్వు నాతో టైమ్ పాస్ చేసావని నర్మద అనగానే సాగర్ కోప్పడతాడు.. రేపు పెళ్లి చేసుకుందాం నువ్వు రెడీనా అని అనగానే.. నాకు ఇష్టమేనని నర్మద అంటుంది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సాగర్ బట్టలు సర్దుకుంటాడు. అప్పుడే ధీరజ్ వెళ్లి మాట్లాడుతాడు. ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు. సాగర్ మిల్ కి పోదామని అనగానే ఈ రోజు రావట్లేదు నాన్న అంటాడు. ఎందుకని రామరాజు అనగానే నేనే కాలేజీకి తీసుకొని వెళ్తున్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత సాగర్ రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఎందుకని రామరాజు అనగానే.. నేను వెళ్లే పని సక్సెస్ అవ్వాలనగానే సక్సెస్ అవుతుందని రామరాజు అంటాడు. ఆ తర్వాత సాగర్ వేదవతిని హగ్ చేసుకుంటాడు. ఏం జరిగిందని వేదవతి అడుగుతుంది. ఏం లేదని సాగర్, ధీరజ్ లు చెప్తారు. ఆ తర్వాత సాగర్, ధీరజ్ లు నర్మద ఇంటి ముందు వెయిట్ చేస్తుంటారు. మరొకవైపు నర్మదని తన పేరెంట్స్ షాపింగ్ కి వెళదామని బలవంతపెడతారు.
దాంతో నర్మద వెళ్తుంటుంది. అది చూసి సాగర్, ధీరజ్ వాళ్లు ఎక్కడికి వెళ్తుందంటూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో నర్మద పేరెంట్స్ షాపింగ్ చేస్తారు. తాళి తీసుకుంటారు. ఇది నా దగ్గర ఉంచుకుంటానని తాళి తీసుకుంటుంది నర్మద. మరొకవైపు తన వెనకాలే ధీరజ్, సాగర్ ఉంటారు. అక్కడ ప్రేమ ఉంటుంది. వాళ్ళని చూసి మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని ధీరజ్ తో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read