Illu illalu pillalu : అందరు మోసం చేసారని కుప్పకూలిన రామరాజు.. ప్రేమపై ధీరజ్ కోపం!
on Jul 15, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -210 లో......ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడం చూసిన సేనాపతి ఇంటికి వచ్చి రామరాజు కుటుంబంపైకి గొడవకి వెళ్తాడు. అక్కడ ప్రేమ కూడా డాన్స్ కి వెళ్తున్నానని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. నేను వద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావని రామరాజు అడుగుతాడు. ఇంకా మా ప్రేమ నగలు కూడా మీ దగ్గరే ఉన్నాయని సేనాపతి అంటాడు. లేవని రామరాజు అంటాడు. ఉన్నాయ్ అవి లాకర్ లో పెట్టానని వేదవతి అనగానే రామరాజు షాక్ అవుతాడు.
నిజాలు బయటపడ్డాక ఇప్పుడు ఎందుకు నాటకాలని భద్రవతి అంటుంది. ఆయనని ఏం అనకండి ఆయనకి ఏం తెలియదు మీరేమైన అంటే నన్ను అనండి అని వేదవతి అంటుంది. రామరాజు పై చెయ్ చేసుకుంటాడు సేనాపతి. ఆ గొడవలో రామరాజు చొక్కా చిరిగిపోతుంది. ధీరజ్ వాళ్ళు విశ్వపై గొడవకి వెళ్తారు. ఆ తర్వాత రామరాజు తన కుటుంబంతో లోపలికి వస్తాడు. అంతా కలిసి మోసం చేశారని రామరాజు బాధపడతాడు. నేనేం చెప్పిన మీకోసం కానీ మీకు అర్థం కాదని రామరాజు బాధపడతాడు.
వేదవతి మాట్లాడబోతుంటే నువ్వింకేం మాట్లాడకు.. నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదు కానీ నువ్వు కూడ నా దగ్గర నగల విషయం దాచావని రామరాజు అంటాడు. నేను మర్చిపోయానని వేదవతి అంటుంది. ఆ తర్వాత దీనంతటికి కారణం నువ్వే అసలు వద్దని చెప్పిన ఎందుకు డాన్స్ క్లాస్ కి వెళ్ళవని ప్రేమని అడుగుతుంది వేదవతి. ధీరజ్ కోసమని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ధీరజ్ కి ప్రేమ సారీ చెప్తుంటే ధీరజ్ మాత్రం ప్రేమపై కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



