Illu Illalu Pillalu: శ్రీవల్లితో ఆడుకున్న ప్రేమ.. భయంతో వణికిపోయిందిగా!
on Oct 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -281 లో... శ్రీవల్లి దగ్గరికి నర్మద వచ్చి.. మీ వాళ్ళు రేపు ప్రొద్దున వరకు ఇక్కడ ఉండాలి.. లేదంటే మీ భాగోతం మొత్తం మావయ్య గారి ముందు బయట పెడుతానని నర్మద అంటుంది. శ్రీవల్లి భయపడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యానికి ఫోన్ చేసి నర్మద చెప్పిందంతా చెప్తుంది. దాంతో ఆనందరావు టెన్షన్ పడతాడు.
మరొకవైపు ప్రేమ డ్రింక్ చేసి ఉంటుంది. తనని ముందు కూర్చోబెట్టుకొని బైక్ పై ధీరజ్ వస్తాడు. ఇంటికి వచ్చాక ప్రేమ ఊగుతూ మాట్లాడుతుంటే శ్రీవల్లి చూస్తుంది. ప్రేమ ఏంటి అలా మాట్లాడతుందని అడుగతుంది. ఒరేయ్ ధీరజ్ అది దెయ్యంరా అని శ్రీవల్లిని ప్రేమ అంటుంది. నన్ను దెయ్యం అంటావా అని శ్రీవల్లి కోప్పడుతుంది. శ్రీవల్లి లోపలికి వెళ్లి.. అమ్మ ప్రేమా తాగి డాన్స్ చేసావా.. నీ సంగతి మావయ్యకి చెప్తానని అనుకుంటుంది.
భలే దొరికావే నీ సంగతి చెప్తానని శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్తుంటే.. ప్రేమ హాల్లో కూర్చొని రారా అని చేతిలో కత్తి పట్టుకుంటుంది. అది చూసి శ్రీవల్లి భయపడుతుంది. శ్రీవల్లి చేత ప్రేమ డ్యాన్స్ చేపిస్తుంది. ఎక్కడ కత్తితో పొడుస్తుందోనని ప్రేమ చెప్పినట్లు శ్రీవల్లి చేస్తుంది. ఆ తర్వాత గాజు వక్కలు ఇచ్చి డ్యాన్స్ చెయ్యమని ప్రేమ చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



