Illu Illalu Pillalu: శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ.. యాక్టింగ్ తో కవర్ చేసుకుందిగా!
on Oct 1, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -277 లో... అసలు నా అకౌంట్ లో డబ్బు ఎందుకు తీసావ్, అంత అవసరం ఏం వచ్చిందని ధీరజ్ ని రామరాజు కొట్టబోతుంటే రామరాజు చేయి పట్టుకుంటుంది ప్రేమ. దాంతో అందరు షాక్ అవుతారు. మావయ్య గారి చేయి పట్టుకుంటున్నావ్ ఏంటి? నీకు మావయ్య గారంటే గౌరవం లేదా? అని ప్రేమని శ్రీవల్లి తిడుతుంది. మీ ఆయన జల్సా కోసం అలా ఖర్చు చేస్తుంటే.. అడిగితే తప్పా అని ప్రేమతో శ్రీవల్లి అంటుంది. అసలు మా ఆయన డబ్బు తీసింది మీ ఆయన కోసమే అని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు.
చందుకి రామరాజు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు. ధీరజ్ నీకు లక్ష రూపాయలు ఇచ్చాడా అని అడుగుతాడు ఇచ్చాడని చందు చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మీకు తెలియకుండా పెద్ద తప్పు చేశాను నాన్న.. నేను వల్లి వాళ్ళ కుటుంబానికి డబ్బు ఇచ్చానని జరిగింది మొత్తం చెప్పబోతుంటే అంతలో శ్రీవల్లి అడ్డుపడి లక్ష రూపాయలు ఇచ్చాడని అంటుంది. మరి నీకు ఇదంతా తెల్సినప్పుడు మా అయనని దొంగ అంటూ మాట్లాడుతున్నావని శ్రీవల్లిపై ప్రేమ గొడవకి దిగుతుంది. మీరందరు ఒకటి.. నేను ఒకటి అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంటే సమాధానం చెప్పకుండా అలా అంటున్నావని నర్మద అంటుంది. ఇద్దరు ఒకటై నన్ను ఇలా చేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. అలా తోడికోడల్లు గొడవ పడుతుంటే రామరాజు కోప్పడతాడు.. అందరిని లోపలికి వెళ్ళమంటాడు.
నాన్న దగ్గర నుండి ఎందుకు తీసావ్ రా అని ధీరజ్ ని చందు అడుగగా అంతకు మించి మార్గం కన్పించలేదని ధీరజ్ అంటాడు. చందు, ధీరజ్, సాగర్ హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతారు. మరొకవైపు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది.. కోడళ్ళకి నువ్వు అంటే భయం ఉందా.. ఎలా గొడవ పడుతున్నారని వేదవతితో రామరాజు అంటాడు. వాళ్ళకి నేనంటే భయం ఉందని వేదవతి అంటుంది. తరువాయి భాగంలో ఎందుకు మా అన్నయ్యకి డబ్బు ఇచ్చానని మా నాన్నకి చెప్పావని ప్రేమతో ధీరజ్ గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



