Karthika Deepam2 : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన గౌతమ్.. దీపకి నిందలు!
on Mar 28, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.....ఈ దీప నన్ను కొడుతున్నా అందరు సైలెంట్ గా ఉన్నారంటే ఈ వంట మనిషి చెప్పేది మీరు నమ్ముతున్నారా.. జ్యోత్స్న తన బావని ప్రేమించింది అయిన నాకు జ్యోత్స్న ఇష్టం కాబట్టి పెళ్లికి ఒప్పుకున్నాను.. అక్కడ నిల్చున్న మీ అల్లుడిని ఎందుకు దూరం పెట్టారో నాకు తెలుసు.. అయినా సైలెంట్ గా ఉన్నా.. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇలా అవమానిస్తారనుకోలేదని గౌతమ్ ఎంగేజ్ మెంట్ రింగ్ విసిరేస్తాడు. ఈ నిశ్చితార్థం కదా పెళ్లి కూడా అవ్వదని గౌతమ్ కోపంగా వెళ్లిపోతాడు. మీకు మీ సంబంధానికి ఒక దండం అంటూ గౌతమ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు.
ఇక ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ అయినందుకు దీపపై కోప్పడతాడు శివన్నారాయణ. ఒకరకంగా జ్యోత్స్నకి మంచే జరిగింది. వాడు మంచి వాడు కాదు తాతయ్య అని శివన్నారాయణతో దీప చెప్తున్నా కూడ వినిపించుకోడు. నీకేం అన్యాయం చేసాను దీపా.. నా బావని నాకు కాకుండా చేసావ్.. అన్ని మర్చిపోయి గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇలా చేసావని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అందరు కలిసి నా పరువు తీసారని శివన్నారాయణ అంటాడు. దీపని మెడ పట్టుకొని పారిజాతం బయటకు గెంటేస్తుంది.
జ్యోత్స్న ఏడుస్తుంటే సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇక సుమిత్ర పట్టరాని కోపంతో దీప దగ్గరికి వస్తుంది. ఎందుకు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావంటూ అడుగుతుంది. అమ్మ నాకు అన్నం పెట్టిన ఇల్లు.. మీరు బాధపడేలా నేనేందుకు చేస్తాను.. నిజంగానే వాడు మంచి వాడు కాదని దీప అంటుంది. అందుకు సాక్ష్యం ఉందా అని సుమిత్ర అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
