అశ్వత్థామ లవ్ స్టోరీ బిగిన్స్.. ఇక యష్మీలో ఆ కోణం బయటకురానుందా!
on Oct 20, 2024
బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక మరింత రసవత్తరంగా సాగుతుంది. బిగ్ బాస్ హౌస్ కాస్త ప్రేమ జంటలకి అడ్డాగా మారింది. ఇప్పటికే హౌస్ లో లవ్ బర్డ్స్ విష్ణుప్రియ-పృథ్వీ ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడు హౌస్ లో కొత్తగా మరొక ప్రేమ చిగురించింది.
గౌతమ్ అలియాస్ అశ్వథ్థామ యష్మీ పాప దగ్గరికి వచ్చి తన మనసులో మాట చెప్పేసాడు. నువ్వు అంటే నాకు ఇష్టం.. అందరిలో నువ్వే క్యూట్ గా ఉన్నావ్.. చూడగానే క్రష్ అనిపించింది. ఏదైనా సరే ఫర్ దర్ గా బయటకు వెళ్ళాక ప్రొసీడ్ అవుదామని గౌతమ్ అనగానే.. నీ ఇష్టం.. నేను తప్పు పట్టలేదు.. అది నీ ఒపీనియన్ కానీ ఏదైనా హర్టింగ్ గా ఉంటే చెప్పే రైట్ నాకుంది. డైరెక్ట్ చెప్పేస్తానని యష్మీ అంది. అయితే తను అంత రూడ్ గా కాకుండా కొంచెం స్మూత్ గానే డీల్ చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు పృథ్వీ, విష్ణుప్రియ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పొచ్చా వద్దా అనుకుంటూ చెప్పేస్తుంది. గౌతమ్ మాట్లాడాడు.. నేను అంటే ఇష్టమట అంటూ చెప్తుంది. ఇక ఇద్దరు యష్మీని ఆట పట్టిస్తారు. దాంతో ఎవరు పూర్తిగా వినరా అని యష్మీ అంటుంది. నిఖిల్ ఏమైనా ఫీల్ అవుతాడా అంటూ నిఖిల్ టాపిక్ అయితే తీసుకొని వస్తుంది. ఏదైనా ఉంటే బయటకు వెళ్ళక చూసుకుంటా.. ఇప్పుడు గేమ్ ని డిస్టబ్ కానివ్వనని యష్మీ అంటుంది.
యష్మీకి మొదటి నుండి నిఖిల్ అంటే ఇస్టమే.. అది ఎప్పుడు బయటకు చెప్పకపోయిన అది మాత్రం వాస్తవమే. ఇక మన అశ్వథ్థామ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో శుభశ్రీ రాయగురుతో లవ్ ట్రాక్ ట్రై చేసాడు. ఇప్పుడు ఇలా ఇదంతా చూస్తుంటే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేందుకు పెద్ద ప్లానే వేసినట్లు అనిపిస్తుంది. అయితే నాగార్జున కూడా యష్మీ గురించి మాట్లాడుతున్నప్పుడు.. యష్మీ గురించి చెప్పమన్నప్పుడు.. ఈ రోజు యశ్మీ బాగుందంటూ నవ్వేస్తాడు గౌతమ్. దాంతో యష్మీ ఒక స్మైల్ విసురుతుంది. ఆ సీన్ కి మన ఎడిటర్ మామ ఒక లవ్ సాంగ్ ఆడ్ చేసి మరింత క్రేజ్ పెంచేశాడు.
Also Read