బిగ్ బాస్ ని ఎందుకు అవమానించావ్.. అశ్వత్థామని క్రియేట్ చేసుకుంది ఎవడు?
on Oct 15, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో గౌతమ్ ని రోహిణి చేసిన నామినేషన్ హైలైట్ గా నిలిచింది. బిగ్ బాస్ కామెడీ చేస్తూ టాస్క్ ఆడమన్నాడు. వాళ్ళని నవ్వించడానికి అవినాష్ చేస్తే నువ్వు అలా మైక్ విసిరేయడం నాకు నచ్చలేదంటూ గౌతమ్ ని రోహిణి నామినేట్ చేసింది.
అవినాష్ నన్ను అలా అన్నాడు అది నాకు నచ్చలేదు. గత సీజన్ లోనే అశ్వత్థామ 2.0 అనే పేరు మీద చాలా ట్రోల్స్ వచ్చాయి నేను డిప్రెషన్ కి కూడా వెళ్ళానంటూ గౌతమ్ అన్నాడు. దీంతో సీజన్ 7 అయిన 8 అయిన నువ్వు క్రియేట్ చేసుకున్నదే నీకు నచ్చలేదంటే మేమేం చేస్తామంటూ రోహిణి అంది. నేను క్రియేట్ చేసుకున్నదే అయితే బాధపడే హక్కు కూడా లేదు అంటే ఏమనాలి.. నేను చేసింది మీ ఉద్దేశంలో ఎంత తప్పో మీరు చేసింది నా దృష్టిలో పది రెట్లు ఎక్కువే తప్పు.. నేను మైక్ పడేయడం వల్ల ఇంకో వ్యక్తిని హర్ట్ చేయలే.. కానీ ఈయన అన్న మాటలు నన్ను చాలా హర్ట్ చేసింది.. నేను లో ఫీల్ అయ్యా.. నన్ను తిట్టలేదు కానీ బుల్లియింగ్ చేశారంటూ గౌతమ్ అన్నాడు. దీంతో మధ్యలో అవినాష్ రెచ్చిపోయాడు. నువ్వు రెస్పెక్ట్ కోరుకుంటున్నావ్ కదా.. మరి మైక్ పడేసి బిగ్‌బాస్‌ను ఎందుకు డిస్ రెస్పెక్ట్ చేశావ్.. మరి బిగ్‌బాస్ అనే షోకి రెస్పెక్ట్ లేదా అంటూ అవినాష్ అడిగాడు.
మచ్చా.. నువ్వు మొత్తం తిప్పి ఎక్కడికో తీసుకెళ్లకు.. నేను మైక్ పడేయడం తప్పని చెబుతున్నానంటూ గౌతమ్ అనగా.. నేను అదే చెబుతున్నా.. కావాలని చెయ్యలేదు.. వేలు పెట్టి గెలకలేదంటూ అవినాష్ ఫైర్ అయ్యాడు. అది నాకు చాలా మెంటల్ స్ట్రెస్ ఇచ్చిందంటూ గౌతమ్ అంటే మాకు అదే అనిపించింది.. నువ్వు మైక్ పడేసినప్పుడు అందరు ఏమనుకుంటారు.. ఈ అవినాష్ గాడు కావాలనే చేస్తున్నాడు.. వాడికి కామెడీ రాదు..అనుకోవాలని అలా చేశావా.. ఏ నేను ఎర్రిపప్పలా కనపడుతున్నానా నీకు అంటూ అవినాష్ ఫుల్ అగ్రెసివ్ అయ్యాడు. బుల్లియింగ్ అనే టాపిక్ నిన్న నాగార్జున సర్ దగ్గర ఎందుకు తీయలేదు.. ఇప్పుడు తీస్తున్నావ్ ఎందుకు.. ఏ కామెడీ తీస్కోలేనప్పుడు డబ్బులు కూడా తీసుకోకండి..షోకి రాకండి.. అంటూ అవినాష్ అన్నాడు.
కామెడీ అంటే ఇష్టమొచ్చినట్లు బుల్లియింగ్ చేయడమా అంటూ గౌతమ్ మళ్లీ అదే మాట్లాడాడు. దీంతో ఎవరు చేశారు గౌతమ్.. పన్నెండేళ్లుగా కామెడీ చేస్తున్నాను.. ఎవరినీ కించపరచలేదు.. ఎవరిని హర్ట్ చేయలేదంటూ అవినాష్ అన్నాడు. దీనికి ఇది కామెడీ షో కాదు మచ్చా అని గౌతమ్ అనగానే.. మీరు నవ్వేటప్పుడు నవ్వుతారు.. కొన్ని విషయాలు తీసుకోరు.. అంటే నా తప్పా అది.. అంటూ అవినాష్ అడిగాడు. నేను ఇప్పుడు బుల్లియింగ్ అని చెప్పడానికి రీజన్ మీరు మళ్లీ మళ్లీ అదే పాయింట్ గుచ్చుతున్నారు కాబట్టి అంటూ గౌతమ్ అన్నాడు. ఎవరు గుచ్చుతున్నారు బాబూ.. అశ్వత్థామ 2.0 అని క్రియేట్ చేసుకుంది ఎవరు.. నాకు తెలీదు భయ్యా.. సారీ నాకు తెలీదు.. ఇంకెప్పుడూ చేయనంటూ లెంపలు వేసుకున్నాడు అవినాష్. బుల్లియింగ్ అంటున్నావ్.. అంటే నీకు అర్థం తెలుసా అంటూ రోహిణి అడుగగా.. ఒక మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెప్పడాన్నే బుల్లియింగ్ అంటారంటూ గౌతమ్ అంటాడు. దీంతో మాకు తెలీదు.. నువ్వు చెప్పావా బిగ్‌బాస్ గేటు బయట అశ్వత్థామ 2.0 అనొద్దు నాకు నచ్చదని బోర్డ్ పెట్టావా.. బిగ్‌బాస్ ఏమైనా లెటర్ పంపించాడా మీకు.. గౌతమ్‌ను అనొద్దని లెటర్ పంపించారా మీకు.. అంటూ అవినాష్ రెయిజ్ అయ్యాడు. అంటే చెప్పేవరకూ నువ్వు అంటావా అంటూ గౌతమ్ అన్నాడు. ఇలా వీరిద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.