Gangavva: బిగ్ బాస్ సీజన్-8లోకి గంగవ్వ ఎంట్రీ!
on Oct 3, 2024
అనుకుంటే కానిది ఏమున్నది అనే పాట ఎవరికోసం రాసారో గానీ అది పర్ఫెక్ట్ గా గంగవ్వ కి సెట్ అవుతుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదని ఈ వయసులో గంగవ్వ నిరూపించింది. యూట్యూబర్ గా మోస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీ ఎవరంటే గంగవ్వ అనడంలో ఆశ్చర్యం లేదు. ఒక మారుమూల గ్రామం నుండి ఇప్పుడు దేశం గుర్తించదగ్గ స్థాయికి వచ్చిన వారిలో గంగవ్వ ఒకరు.
గంగవ్వ యూట్యూబ్ లో గ్రామీణ నేపథ్యంలో జరిగే కొన్ని సన్నివేశాలని వీడియో రూపంలో చేస్తూ ఫేమస్ అయింది. గంగవ్వ మాట తీరు తమాషాగా ఉండడంతో అందరు తన వీడియోస్ ని లైక్ చేస్తారు. అసలు విషయానికి వస్తే ఎంత సెలబ్రిటీ అయిన జీవితంలో ఒక్కసారైన బిగ్ బాస్ లోకి వెళ్ళాలని అనుకుంటారు కానీ అది అందరికి సాధ్యం కాదు. అలాంటిది ఒక మారుమూల ప్రాంతంలో అరవై సంవత్సరాలపై చిలుకు వయస్సున్న మహిళకి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అది కూడా సీజన్-4 లో తను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు హౌస్ లో అందరు గంగవ్వని దగ్గరుండి చూసుకునేవారు. తనకి సేవ చేయడానికి పోటీపడేవారు. మరి ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి రావడమే ఆశ్చర్యమంటే ఇప్పుడు సీజన్-8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్-4 లో గంగవ్వ ఎంటర్టైన్మెంట్ చేయడంతో తనకి మంచి ఓటింగ్ ఉండేది. కానీ అప్పుడు తన ఆరోగ్యం బాగోలేక పలుమార్లు నేను ఇంటికి వెళ్తా.. నాకు ఈ వాతావరణం పడడం లేదని.. బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చెయ్యడంతో బిగ్ బాస్ ఆమెని బయటకు పంపించాడు. మళ్ళీ ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎంటర్టైన్మెంట్ పరంగా ఏ డోకా లేదు మరి ఆ వాతావరణానికి తను ఉంటుందో లేదో అన్న విషయమే సందేహం. అయితే ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్ లోకి వస్తుందనే వార్త ఫుల్ వైరల్ గా మారింది.