దేవుడు ఉన్నాడో లేడో తెలీదు కానీ సుకుమార్ నా దేవుడు
on Apr 25, 2025
.webp)
ఫ్యామిలీ స్టార్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఈ షోకి "పెళ్లి కాని ప్రసాదు" మూవీ టీమ్ వచ్చింది. సప్తగిరి, కిట్టయ్య వంటి సీనియర్ నటులు వచ్చారు. అందులో కిట్టయ్య మూవీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "నా లైఫ్ గురించి నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక ఆర్టిస్ట్ ని అవుతానని..ఆర్టిస్ట్ అయ్యే అర్హత నాకు లేదు. సుకుమార్ వలన ఇండస్ట్రీకి రాగలిగాను. అతను నా ఫ్రెండ్ అవడం వలన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. నాలోని ఆర్టిస్ట్ ని బయటకు తీసుకొచ్చాడు. కళామతల్లిని దగ్గర చేసాడు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసే పని లేకుండా పోయింది. ఆ తర్వాత రాజావారు రాణివారు అనే సినిమాలో రవి కిరణ్ నాకు మంచి రోల్ ఇచ్చి నా స్థాయిని ఇంకొంచెం పెంచారు.
నన్ను అందరూ గుర్తుపట్టేలా చేశారు. ఇండస్ట్రీలో నాకంటూ ఒక మంచి స్థానాన్ని కల్పించారు. వాళ్ళిద్దరికీ నేను ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను. సుకుమార్ నాకు ఫ్రెండ్ కావడం వలన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దేవుడు అనే వాడు ఉన్నాడో లేడో తెలీదు కానీ సుకుమార్ నా దేవుడు" అని చెప్పాడు కిట్టయ్య. ఆ మాటలు సుధీర్ రియాక్ట్ అయ్యాడు. "అంత మంచి ఫ్రెండ్స్ ఉండడం అదృష్టం..ఫ్రెండ్స్ అంటేనే కష్టకాలంలో ఆదుకునేవాళ్లు" అన్నాడు. కిట్టయ్య "రంగస్థలం" మూవీలో తన నటనతో అందరినీ అలరించాడు. అలాగే “ 2021 లో వచ్చిన మహా సముద్రం” “2023 లో వచ్చిన బెదురులంక 2012” “2024 లో లంబసింగి” అలాగే "రాజా వారు రాణి వారు" వంటి ఎన్నో మూవీస్ లో నటించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



