అభి రివర్స్ డ్రామా.. రామలక్ష్మికి సీతాకాంత్ నిజం చెప్పగలడా!
on May 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -88 లో.. సీతాకాంత్ ఎక్కడ అభి నిజస్వరూపం బయటపెడుతాడోననే భయంతో.. రామలక్ష్మికి సీతాకాంత్ గురించి నెగెటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. నాకు సీతాసర్ డబ్బులు ఇవ్వడం వెనకాల.. ఏదో నీపై అభిప్రాయం ఉందని చెప్తాడు. నిన్ను నన్ను విడగొట్టడం కోసం మా అమ్మ హాస్పిటల్ కి అని డబ్బులు అబద్ధం చెప్పి తీసుకున్నానని నా గురించి నీకు చెడుగా చెప్తాడని రామలక్ష్మితో అభి అంటాడు.
ఆ తర్వాత సీతా సర్ అలాంటి వారు కాదని రామలక్ష్మి చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ నువ్వే చూడు ఇక నా గురించి చెప్పే నెగెటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. నువ్వు వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదంటు రామలక్ష్మిని అభి పంపిస్తాడు. మరొకవైపు ధన జాబ్ కి ప్రిపేర్ అవుతుంటాడు. అప్పుడే సిరి వస్తుంది. నువ్వు జాబ్ చెయ్యడమేంటి? అన్నయ్యకి ఎన్ని బిజినెస్ లు ఉన్నాయి.. అందులో ఏదో ఒకటి చూసుకోమని సిరి అంటుంది. నువ్వు అంటున్నంత ఈజీ కాదు.. మీ అన్నయ్య ఏదో నీపై ప్రేమతో మన పెళ్లికి ఒప్పుకున్నాడంతే.. మా రామలక్ష్మి అక్క అంటే మీ అన్నయ్యకి ఇష్టం లేదు.. ప్రొద్దున అందరం బయటకు వెళదామంటే రాలేదని ధన అంటాడు. నేను అన్నయ్యతో నీ జాబ్ గురించి మాట్లాడుతానని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్ ఇంటికి వచ్చి.. రామలక్ష్మి కి అభి గురించి చెప్పాలనుకొని రామలక్ష్మి కోసం చూస్తుంటాడు. అప్పుడే సిరి వచ్చి ధన జాబ్ చెయ్యాలి అనుకుంటున్నాడనగానే.. అవునా చెయ్యమను అని సీతాకాంత్ అంటాడు.. అదేంటి అన్నయ్య అలా అంటున్నాడని సిరి షాక్ అవుతుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ఇంట్లో లేకపోయేసరికి.. అభి ఏమైనా చేశాడా అని సీతాకాంత్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత కాసేపటికి రామలక్ష్మి వస్తుంది. ఇప్పటివరకు ఎక్కడ కి వెళ్ళావంటు శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు అడుగుతుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాకు చెప్పే వెళ్ళింది అంటూ సీతాకాంత్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. శ్రీలత కావాలనే ఏదో ఒకటి అంటుంటే రామలక్ష్మి తినకుండా వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read