Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కన్నింగ్ ప్లాన్.. కోడలు కనిపెట్టేనా!
on Dec 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -276 లో....ధన సడెన్ గా రావడంతో అందరూ డౌట్ గా ఇప్పుడు వచ్చావని అడుగుతారు. పనిమీద వచ్చాను.. సిరిని చూసి వెళదామని వచ్చానని ధన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్లాడానికి బయటకు వస్తారు. కార్ నేను డ్రైవ్ చేస్తానంటూ ఇద్దరు అంటారు. కానీ సీతాకాంత్ డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత సందీప్ ధనని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తాడు. అత్తయ్య ఇప్పటికే నాపై కోపంగా ఉందంటూ ధన భయపడుతాడు.
అయిన శ్రీలత దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక జరిగింది మొత్తం సందీప్ చెప్తాడు. అత్తయ్య మీరే ఈ ప్రాబ్లమ్ నుండి నన్ను బయటకు పడెయ్యాలని ధన అంటాడు. శ్రీలత కూడా ధనని అడ్డుపెట్టుకొని రామలక్ష్మిని దెబ్బ తియ్యాలనుకుంటుంది. దాంతో ఇక ఏం చేస్తాను ఒకవైపు కొడుకు మరొకవైపు అల్లుడు ఇక చెయ్యక ఛస్తానా అని శ్రీలత అంటుంది కానీ ఈ విషయం రామలక్ష్మికి తెలియొద్దని ధనతో చెప్తుంది శ్రీలత. దానికి ధన కూడా సరే అంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు విడగొటడం నీ గురించి తెలిస్తే సీతాకాంత్ కి బాగుండదని నందినితో హారిక అంటుంది. అయిన త్వరలో సీతాకాంత్ చెయ్ పట్టుకోబోతున్నానని నందిని అంటుంది.
అప్పుడే రామలక్ష్మి సీతాకాంత్ లు చెయ్యి పట్టుకొని వస్తారు. అది చూడలేక రాయిలు కింద విసురుతుంది. రామలక్ష్మి పడిపోబోతుంటే సీతాకాంత్ పటుకుంటాడు. మళ్ళీ నందిని వచ్చి చెయ్ విడిపించి సీతా ఫైల్స్ చూడాలనగానే.. సరే రామలక్ష్మి నేను చూస్తాం ఏదైనా డౌట్ ఉంటే నిన్ను పిలుస్తామని సీతాకాంత్ అనగానే నందినికి ఇంకా కోపం వస్తుంది. మరొకవైపు ధనకి సందీప్ కి ఎలా హెల్ప్ చెయ్యాలని శ్రీలత ఆలోచిస్తుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తన మాటల్లో శ్రీలతకి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read