Eto Vellipoyindhi Manasu : భార్యని హగ్ చేసుకొని సారీ చెప్పిన భర్త...
on Dec 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -269 లో.....రామలక్ష్మి సర్ ప్రైజ్ అంటూ సీతాకాంత్ ని ఇంటికి తీసుకొని వస్తుంది. సీతాకాంత్ ఇంటికి రాగానే తాతయ్యకి బాగోలేదని శ్రీలత చెప్తుంది. ఇదేనా సర్ ప్రైజ్.. ఛీ ఇక మారదంటూ సీతాకాంత్ రామలక్ష్మిపై చిరాకు పడతాడు. సీతాకాంత్ పెద్దాయన దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు.. మీరు తప్పు ఒప్పుకొని సీతా సర్ ని నన్ను ఒకటి చేస్తానన్నారు కదా అని రామలక్ష్మి అనగానే.. శ్రీలత పొగరుగా మాట్లాడుతుంది.
శ్రీలత రౌడీకి ఫోన్ చేసి శంకర్ గురించి అడుగగా నా దగ్గరున్నాడని అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. మమ్మీ ప్లాన్ సూపర్ అంటూ సందీప్ అంటాడు. మీరు మారారు అనుకున్నా కానీ ఇప్పుడు మీరేంటో పూర్తిగా అర్థమైంది. ఇంకా మీతో ఎలా జాగ్రత్తగా ఉండాలో అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నా సీతా సర్ అంటే నాకు ఎంత ఇష్టమే చెప్పి ఎలా దగ్గర అవుతానో చూడండి అని శ్రీలతకి సవాలు విసురుతుంది రామలక్ష్మి ఆ తర్వాత రామలక్ష్మి గదిలో ఉండగా సీతాకాంత్ వెళ్తుంటే మీరు వారం రోజుల్లో మీ ప్రేమ చూపిస్తానన్నారు అదేంటీ పక్కన ఉంటేనే కదా తెలిసేది అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ ఉంటాడు. ఆ తర్వాత మీకు నాపై ప్రేమ ఎప్పుడు మొదలైందని రామలక్ష్మి అడుగగా.. మొదట నుండి సీతాకాంత్ చెప్పుకొని వస్తాడు. సీతాకాంత్ తనపై చూపించిన ప్రేమని రామలక్ష్మి గుర్తుచేసుకుంటుంది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. థాంక్స్ అత్తయ్య గారు మీరు తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేశారని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తుంటే ఏ చీర కట్టుకోవాలని రామలక్ష్మి అడుగగా.. ఈ చీర అని సీతాకాంత్ చెప్తాడు. ఈ చీరలో ఎలా ఉంటాననగానే రామలక్ష్మిని సీతాకాంత్ హగ్ చేసుకుంటాడు. సారీ రామాలక్ష్మి.. నీ పర్మిషన్ లేకుండా హగ్ చేసుకున్నానని సీతాకాంత్ అంటాడు. భార్యని హగ్ చేసుకొని సారీ చెప్పే భర్త నేనే అని సీతాకాంత్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక ఈయన నీ బాధపెట్టొద్దు. నా ప్రేమ చెప్పాలనుకుంటుంది రామలక్ష్మి. అప్పుడే మాణిక్యం ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read