ENGLISH | TELUGU  
Home  » TV News

Eto  Vellipoyindhi Manasu : దొంగ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన రామలక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందా!

on Jul 5, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -140 లో... అసలు దొంగతనం ఎలా జరిగిందంటూ రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. సందీప్ తన గదివైపు నుండి వచ్చింది.. రామలక్ష్మి గుర్తుకుచేసుకొని మళ్ళీ సందీప్ తడబడుతున్నా సంఘటన గుర్తుకి తెచ్చుకుంటుంది. అసలు సందీప్ నే ఆ నగలు తీసి ఉంటాడు. నగలు తీసి ఏం చేసాడని ఆలోచిస్తున్న రామలక్ష్మికి.. మల్లేష్ ఇంటికి వచ్చి సందీప్ ని కలవాలన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అతన్ని ఎక్కడో చూసాననుకుంటూ మాణిక్యంతో మల్లేష్ డబ్బులు గురించి గొడవపడ్డ విషయం గుర్తుకుచేసుకొని అతను సందీప్ దగ్గరికి రావడమేంటి సందీప్ అతని దగ్గర అప్పు తీసుకున్నాడా.. ఈ నగలు దొంగతనం చేసి అతనికి ఇచ్చాడా అని రామలక్ష్మి ఆలోచిస్తుంది.

ఆ తర్వాత మాణిక్యానికి రామలక్ష్మి ఫోన్ చేసి మల్లేష్ గురించి అడుగుతుంది. ఇప్పుడు వాడి గురించి ఎందుకు.. వాడు అసలే మంచోడు కాదని మాణిక్యం అంటాడు. వాడి అడ్రస్ మాణిక్యం దగ్గర రామలక్ష్మి తీసుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి మల్లేష్ దగ్గరికి బయలుదేర్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని సీతాకాంత్ అడుగగా.. నన్ను దొంగ అని నింద వేశారు కదా అందుకే నాపై పడ్డ నింద నిజం కాదని రుజువు చెయ్యాలి కదా అని రామలక్ష్మి అంటుంది. నేను అన్లేదని సీతాకాంత్ అనగానే.. మీరు అనేవాళ్ళకి సపోర్ట్ చేశారు కదా అని రామలక్ష్మి అంటుంది. నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తానని సీతాకాంత్ అంటాడు. నిందలు వేసిన వాళ్ళ హెల్ప్ నేను తీసుకోనంటూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది. అపుడే పెద్దాయన వచ్చి.. ఏంటి రామలక్ష్మి కోపంగా వెళ్తుందని అడుగుతాడు. నేను వస్తానంటే వద్దని అంటుంది. ఏదైన ప్రాబ్లెమ్ లో పడుతుందేమోనని భయంగా ఉంది తాతయ్య అని సీతాకాంత్ అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు.. నేను తనని ఫాలో అయి వెళ్తానంటూ పెద్దాయన వెళ్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆటోలో వెళ్తుంటే.. పెద్దాయన ఫాలో అవుతాడు. కాసేపటికి ఆటో డైవర్ట్ అయిపోతుంది.

ఆ తర్వాత మల్లేష్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. నేను మాణిక్యం కూతురిని, నాకు మీ దగ్గర తాకట్టు లో ఉన్నా నగలు కావాలి అంటూ రిక్వెస్ట్ చెయ్యగానే సరేనని మల్లేష్ ఒక నెక్లెస్ చూపిస్తాడు. అది చూసి తన నగలే అనుకుంటుంది. ఇంకా కావాలని రామలక్ష్మి అనగానే.. సరేనని మల్లేష్ లోపలికి వెళ్తాడు. అప్పుడే మల్లేష్ కి  సందీప్ ఫోన్ చేసి ఒకావిడ నగలంటూ వస్తుంది అంటూ జరిగింది మొత్తం సందీప్ చెప్తాడు. ఇక రామలక్ష్మి ఫోటోని సందీప్ పంపిస్తాడు. అది మల్లేష్ చూసి షాక్ అవుతాడు. నన్ను పోలీసులకి పట్టించాలని చూస్తావా అని మల్లేష్ అనుకొని రామలక్ష్మి లోపలికి పిలిచి.. నువ్వు ఎవరో నగల వంకతో ఎందుకు వచ్చావో నాకు తెలుసంటూ రామలక్ష్మిని మల్లేష్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.