Eto Vellipoindi Manasu : రమ్య ప్లాన్ తెలుసుకున్న రామలక్ష్మి.. అతడికి నిజం చెప్పనుందా!
on Mar 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో... రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం రామలక్ష్మి చూస్తుంది. రమ్య వెళ్ళిపోయాక అడ్వాన్స్ తీసుకున్నఅతని దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. రమ్య గురించి అడుగుతుంది. ఇల్లు కొంటానంటే నీకు అంత సీన్ లేదన్న అందుకే పొగరుగా వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తుందని అతను చెప్తాడు. అంత డబ్బు ఎలా వచ్చిందంటారని రామలక్ష్మి అతన్ని అడుగగా.. చూస్తే తెలియడం లేదా నిన్న నడుచుకుంటూ వచ్చింది.. ఇప్పుడు కార్ లో వచ్చింది.. ఎవడో బకరాని పట్టిందని అతను అంటాడు.
ఆ తర్వాత రామ్ కి రమ్య భోజనం తినిపిస్తుంది. నిన్ను అందరిలాగే పేరు పెట్టి పిలుస్తానని రామ్ అనగానే సరే అని రమ్య అంటుంది. అదంతా సీతాకాంత్ చూస్తుంటాడు. రమ్య నాపై ప్రేమతో రామ్ ని బాగా చూసుకుంటుంది.. నేనే తనని అవసరం కోసం వాడుకుంటున్నానని అనుకుంటాడు. మీరు ఇలా నాపై జాలి చూపిస్తేనే కదా మీరు నాకు దగ్గర అయ్యేదని రమ్య అనుకుంటుంది. రమ్య చూసారా తన నటనతో బావ గారిని ఎలా పడేస్తుందోనని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి ఫణీంద్ర మనిషి వచ్చి రమ్య గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తాను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది. సందీప్ అకౌంట్ నుండి తన అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్తాడు. నా అనుమానమే నిజం అయిందన్నమాట అని రామలక్ష్మి అనుకొని సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది.
మరోవైపు నా రామలక్ష్మి రేపు బయటపడుతుందనుకుంటే ఈ రోజే బయటపడుతుంది. ఎందుకు కలవాలని ఫోన్ చేసింది.. ఇప్పటికైనా ఒప్పుకుంటుందేమో అని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి శ్రీలత, రమ్య నాటకం గురించి చెప్పినట్లు దాంతో నువ్వే రామలక్ష్మివి అని సీతాకాంత్ అన్నట్లు.. దాంతో ఏం చేయలేక రామలక్ష్మి నిజం ఒప్పుకున్నట్లు ఉహించుకుంటుంది. ఇక రామలక్ష్మి వస్తుంటుంది..అలా సీతాకాంత్ దగ్గర వరకు వచ్చి అలా కాకుడదని వెళ్లిపోతుంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మిని సీతాకాంత్ చూసి ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు. కొంచెం బిజీ అందుకే వెళ్తున్నానని వెళ్తుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటపడాలి కదా అని సీతాకాంత్ అనుకుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, రమ్య ముగ్గురు నగలు సెలెక్ట్ చేసుకుంటుంటే రామలక్ష్మి వెళ్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
