Eto Vellipoindi Manasu : కొడుకు చేస్తున్న యాగాన్ని ఆపడానికి సవతి తల్లి ప్లాన్!
on Sep 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -201 లో.....రామలక్ష్మి వచ్చిన కలకి భయపడుతూ.. వాళ్ళ అమ్మ సుజాతకి ఫోన్ చేసి సీతాకాంత్ ని కత్తితో పొడిచినట్లు వచ్చిన కల గురించి చెప్తుంది. దాంతో అల్లుడు గారు మంచి వారు తనకి అంత మంచే జరుగుతుంది. నువ్వు కంగారు పడకు.. నేను మన పంతులు గారిని అడుగుతానని రామలక్ష్మికి సుజాత చెప్తుంది. రామలక్ష్మి కంగారు పడుతంటే సీతాకాంత్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. ఏం లేదని రామలక్ష్మి అంటుంది. అయితే వెళ్లి త్వరగా రెడీ అవ్వమని సీతాకాంత్ చెప్తాడు.
ఆ తర్వాత ఇంకా రెడీ అవ్వలేదా అని పెద్దాయన సిరిలు సీతాకాంత్ ని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి అందంగా రెడీ అయి వస్తుంది. సీతాకాంత్ తననే చూస్తుంటాడు. రెడీ అవుతానని సీతాకాంత్ అంటాడు. ఏదో ఆఫీస్ కీ రెడి అయినట్లు కాకుండా పంచె కట్టుకోమని చెప్తాడు. నాకు కట్టుకోవడం రాదని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి హెల్ప్ చేస్తుంది వెళ్ళమంటూ పెద్దాయన పంపిస్తాడు.. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి పంచె కడుతుంది. దాంతో సీతాకాంత్ సిగ్గు పడుతుంటాడు. సీతాకాంత్ రామలక్ష్మిలు కిందకి వస్తుంటే.. సిరి, పెద్దాయన చూసి మురిసిపోతుంటారు.
ఆ తర్వాత పదండి గుడికి అని పెద్దాయన సందీప్ వాళ్ళని అంటాడు. మేమ్ తర్వాత వస్తాం.. మీరు వెళ్ళండి అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అయినా రామలక్ష్మికి నీ ప్రేమ విషయం చెప్పమని సీతాకాంత్ కి పెద్దాయన సలహా ఇస్తాడు. ఆ తర్వాత వాళ్లు యాగం చేస్తుంటే.. మనం చూస్తు ఉంటామా అంటు శ్రీవల్లి కోప్పడుతుంది. యాగం ఆగిపోయేలా ఆల్రెడీ ప్లాన్ చేసానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మాణిక్యం సుజాతలు యాగానికి వస్తారు. మరొకవైపు శ్రీలత మనిషి సీతాకాంత్ పై ఎటాక్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read