Karthika Deepam2 : జ్యోత్స్నపై దశరథ్ కి అనుమానం.. కార్తీక్ కనిపెట్టేశాడా!
on Jan 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-579 లో.. దీపని పొడవడానికి వచ్చిన రౌడీలు పారిపోతారు. కార్తీక్ వారిని వెంబండించిన పట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత దీప, కాంచన ఇద్దరు ఇంటి బయట ఉన్న కార్తీక్ దగ్గరికి వస్తారు. ఏమైందని అడుగగా.. పారిపోయారని చెప్తాడు. మరోవైపు రౌడీలు జ్యోత్స్నకి కాల్ చేస్తారు. చంపేశారా అని జ్యోత్స్న అడుగగా.. లేదని చెప్తారు. మిమ్మల్ని ఎవరైనా చూసారా అని జ్యోత్స్న అడుగగా లేదని రౌడీలు చెప్తారు. ఇక ఫోన్ కట్ చేసిన జ్యోత్స్న.. ఛ ఇది మళ్ళీ తప్పించుకుందని అనుకుంటుంది. అప్పుడే తన వెనకాల దశరథ్ వస్తాడు. అతడిని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరు తప్పించుకున్నారు జ్యోత్స్న అని దశరథ్ అడుగగా.. తను ఏదో కవర్ చేసి చెప్తుంది. అది దశరథ్ నమ్మకుండా అతడికి జ్యోత్స్న మీద అనుమానం కలుగుతుంది.
మరుసటి రోజు ఉదయం కాంచనకి శ్రీధర్ కాల్ చేస్తాడు. ఇక ఎప్పటిలాగా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక రాత్రి దీపని చంపడానికి రౌడీలు వచ్చారని జరిగిందంతా చెప్తుంది.. కాంచన దాంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక అదే విషయాన్ని శివన్నారాయణ దగ్గరికి వచ్చి చెప్తాడు శ్రీధర్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పడం మానేసి ఇక్కడికి వచ్చి చెప్తావేంటని శివన్నారాయణ అంటాడు. దశరథ్.. పోలీస్ స్టేషన్ కి కాల్ చెయ్ అని శివన్నారాయణ అనగానే అవసరం లేదు సర్ అంటూ కార్తీక్ వస్తాడు. ఇక అప్పుడే జ్యోత్స్న మీద దశరథ్ కి డౌట్ వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందేరా అని శివన్నారాయణ అనగానే వాళ్ళేవరో తెలిసిందని కార్తీక్ అంటాడు. ఎవరని దశరథ్ అడుగగా జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. దాంతో శ్రీధర్ తో పాటు పారిజాతం, దీప, శివన్నారాయణ, దశరథ్ అంతా షాక్ అవుతారు.
నేను జ్యోత్స్న అని పిలిచాను అని కార్తీక్ కవర్ చేస్తాడు. నిజానికి జ్యోత్స్ననే చంపాలనుకుంది అని కార్తీక్ తెలిసింది. ఇక శివన్నారాయణని ఓ మాట అడుగుతాడు కార్తీక్. ఎవరికి తెలియని రహస్యం ఎదుటివారిది మనకి తెలిసిందనో.. లేదా ఆ సీక్రెట్ మన దగ్గర ఉందని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారని కార్తీక్ అడుగగా.. అడ్డుతొలగించారని అనుకుంటారని శివన్నారాయణ అంటాడు. ఇక కార్తీక్ కనిపెట్టేశాడని జ్యోత్స్నకి అర్థమవుతుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు.. తను జ్యోత్స్న కూతురు కాదని డాక్టర్ చెప్తుంది. మరి వేరే ఆప్షన్ లేదా అని కార్తీక్ అడుగగా దశరథ్, సుమిత్రల కూతురు అవ్వాలని డాక్టర్ చెప్తుంది. దీప వాళ్ళిద్దరి కూతురు అని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



