పల్లెటూళ్లలో రిలేషన్స్ ని చూపించిన కంటెస్టెంట్స్..విన్నర్స్ గా నిలిచిన భాస్కర్-జ్ఞానేశ్వర్!
on Dec 10, 2022

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి మంచి కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఫస్ట్ రౌండ్ లో సద్దాం వచ్చి పల్లెటూళ్లలో పెద్ద మనుషులతో బస్సు లో వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో చేసి చూపించాడు. బస్సులో డ్రైవర్ చిల్లర ఇవ్వకుండా టికెట్ వెనక రాసి ఇవ్వడం వంటి అన్ని విషయాలు ప్రెజంట్ చేసాడు. తనకు కూడా ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తనకు డ్రైవర్ ఎప్పుడూ చిల్లర ఇవ్వలేదని చెప్పారు చైర్మన్ అనిల్ రావిపూడి.
ఇక తర్వాత యాదమ్మ రాజు వచ్చి కొత్తగా పెళ్లైనప్పుడు అల్లుడికి అత్తగారు మొదట్లో ఇచ్చే విలువ ఎలా ఉంటుంది...ఉద్యోగం పోయి పండగకు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చేసి మస్త్ ఫన్ జెనెరేట్ చేసాడు. తర్వాత వేణు వండర్స్ వచ్చి ఆర్టిస్ట్స్ కి, ఫాన్స్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది..ఆర్టిస్ట్ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పిచ్చి ఫాన్స్ ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించాడు.
తరువాత బావాబామ్మర్దులు ఐన భాస్కర్-జ్ఞానేశ్వర్ వచ్చి మందు తాగము అని ప్రమాణం చేయడం, అప్పటివరకు జరిగిన గొడవల్ని మర్చిపోవడానికి మళ్ళీ మందేయడం అనే ఇష్యూ మీద మంచి కనెక్టింగ్ స్కిట్ వేశారు. చైర్మన్ పడీ పడీ నవ్వేసాడు. అలా ఫస్ట్ రౌండ్ కామెడీ స్కిట్స్ పూర్తయ్యాక ఫస్ట్ రౌండ్ లో భాస్కర్ - జ్ఞానేశ్వర్ విన్నర్స్ గా నిలిచారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



