వాళ్ళ ఇంటికి వెళ్లి నరకాలనిపిస్తుంది అంటున్న జానులిరి
on Dec 7, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ జానులిరి గురించి ఈ మధ్యలో మనం బాగా వింటూ ఉన్నాం. ఎందుకంటే ఈ షో టైటిల్ విన్నర్ ఆమె. అలాగే ఆమెకు శేఖర్ మాష్టర్ ఇచ్చే కామెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఐతే ఈ షో నుంచి ఆమెను తీసేయాలని కూడా అంటూ ఉంటారు. ఐనా ఆ కామెంట్స్ ని పట్టించుకోకుండా ఆమె ఈ షోలో కష్టపడి విన్నర్ అయ్యింది. అలాంటి జాను కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఇలా ఆన్సర్ ఇచ్చింది. "నా వీడియోస్ కి బాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఆ కామెంట్ పెట్టినవాడు కనిపిస్తే గనక ఇంటికి పొయ్యి నరకాలనిపిస్తుంది. ఢీ షోలో కంటెస్టెంట్ గా మా మాస్టర్ మొదట నన్ను ఒద్దు అన్నారు. ఎందుకంటే నేనొక ఫోక్ డాన్సర్ ని కదా అన్ని రకాల స్టైల్స్ లో డాన్స్ చేస్తానా లేదా అని ఆయన భయపడ్డారు.
కానీ తర్వాత నేను అన్ని రకాల డాన్సులు చేసేసరికి నామీద ఆయనకు నమ్మకం పెరిగింది. తెలియని వయసులో పెళ్లి చేసేసుకోవాలని అనిపించి పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్నారు. నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అనుకుంటే మా అబ్బాయి లిరికి మంచి లైఫ్ ఇచ్చి పోవాలి అంతే. మా అభి మాష్టర్ కోరియోగ్రఫీ తర్వాత శోభిత, చిట్టి, పండు మాష్టర్ కోరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏడుపు వీడియోస్ చేయను నేను. మనసులో ఎంతో పెయిన్ ఉంది అందుకే బాధతో ఏడుపు వీడియోస్ చేస్తాను. నేను సారీ చెప్పాల్సి వస్తే మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే లడ్డు అక్కకి చెప్తాను. డాన్స్ లో ప్రత్యేకంగా ఎవరూ నాకు ఇన్స్పిరేషన్ అంటూ లేరు. హీరోయిన్ శ్రేయా గారిని చూస్తూ ఉండేదాన్ని. ఆమె డాన్స్ చూస్తే నాకూ చేయాలనిపించేది అలా నేర్చుకున్నా. ముందు నేను వెల్కమ్ డాన్స్ నుంచి మొదలుపెట్టి ఫోక్ సాంగ్స్ వరకు చేశా ఆ తర్వాత ఢీలో నాకు ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం." అని చెప్పుకొచ్చింది.
Also Read