వరుణవి బాధ్యతలు తీసుకున్న చిరంజీవి
on Jan 8, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న లిటిల్ చాంప్స్ షోలో వరుణవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ చిన్నారి "అనిల్ మావా నన్ను ఒకసారి చిరు మామ దగ్గరకు తీసుకెళ్ళావా" అని అడిగింది. అంతే సెట్ లోంచి ఫోన్ చేసి మెగా అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసి వరుణవిని తీసుకెళ్లారు. "చూస్తుంటే నువ్వు పీకాక్ లా ఉన్నావ్" అంటూ ఆ చిన్నారికి చిరు కాంప్లిమెంట్ ఇచ్చారు. "చిరు సర్ మీకొకటి చెప్పాలనుకుంటున్నా..రికార్డుల్లో మీ సినిమాలు ఉండడం కాదు , మీ సినిమాలపైనే రికార్డులు ఉంటుంది" అని చెప్పింది. తర్వాత మీసాల పిల్ల సాంగ్ పాడి చిరును మెస్మోరైజ్ చేసింది. "చాలా అల్లరిది" అంటూ మెచ్చుకున్నారు చిరు. "ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయసహకారాలైనా సరే నేను బాధ్యత తీసుకుంటాను" అంటూ ప్రామిస్ చేశారు.
"నేను నీకు చాక్లెట్ ఇస్తాను తింటావా..చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చుపోతాయి అంటావు కదా ఎక్కడో విన్నాను" అన్నారు చిరంజీవి. తర్వాత చాక్లెట్ ని స్వయంగా ఆ చిన్నారికి చిరుని తినిపించారు. "నాకు ఎం ఇవ్వకండి మీ ఆశీర్వాదాలు చాలు" అని చెప్పింది. "దొండకాయ్ బెండకాయ్ చిరు మామ నా గుండెకాయ్" అంటూ చెప్పింది వరుణవి. దాంతో చిరు రెగ్యులర్ గా వరుణవి చెప్పే డైలాగ్ ని ఆయన చెప్పారు. "థ్యాంక్యూ సో మచ్ అండ్ గాడ్ బ్లేస్ యు" అన్నారు. ఇక మెగాస్టార్ నటించిన "మన సంకర వరప్రసాద్" మూవీ ఈ నెల 12 న రిలీజ్ కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



