చంటి ఎలిమినేషన్...కంటెస్టెంట్ పై హాట్ కామెంట్స్!
on Oct 10, 2022
.webp)
బిగ్ బాస్ సీజన్ 6 ఐదో వారం కంప్లీట్ ఐపోయింది. అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి లేటెస్ట్ గా ఐదో వారంలో `జబర్దస్త్` కమెడియన్ చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఒక టెన్షన్ క్రియేట్ చేసాక చంటి ఎలిమినేషన్ జరిగింది. ఫైనల్ గా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ గా చంటి ఇంట్లోనుంచి వచ్చేయక తప్పలేదు.
చంటి వెళ్తూ వెళ్తూ హౌస్ మేట్స్ పై తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. అయితే హోస్ట్ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో ఇంటిసభ్యులకు మార్కులు వేయాలని ఆదేశించారు. దాంతో చంటి అర్జున్, సుదీప, రోహిత్, రాజ్, కీర్తికి 34 అండ్ హాఫ్ మార్కులు వేశాడు. అర్జున్ గేమ్ ఆడుతున్నా ఎక్కడో రాజీపడుతున్నాడు అది తగ్గించుకోవాలని చెప్పాడు. సుదీపకి మాత్రం కిచెన్‌లోనే ఎక్కువ టైం సరిపోతోందని గేమ్ ఆడేంత టైం లేదని చెప్పాడు. రోహిత్ మాత్రం తనలాగే ఆడుతున్నాడు చెప్పాడు. రాజ్ అందరినీ నమ్ముతుండడంతో తాను చేయాలో అది చేయలేకపోతున్నాడు, అలాగే కీర్తి తన పాస్ట్ చెప్పడంతోనే సరిపోతోందని అది పక్కన పెట్టి గేమ్ ఆడాలని చెప్పాడు. ఇక ఈ షోకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ గా వచ్చాడు. దేవీ కంపోజ్ చేసిన పాటలతో హోస్ట్ గేమ్ ఆడిపించాడు.
తర్వాత సామెతలతో ఆట ఆడించాడు నాగ్. ఎవరెవరికి ఏ సామెతలు వర్తిస్తాయో చెప్పించాడు. ఇక సూర్య, శ్రీహాన్, ఫైమా, మరీనా, రేవంత్ కు టాప్ మార్క్స్ ఇచ్చేసాడు చంటి. సూర్య ప్రేమించడం ఆపి ఆట ఆడాలని సలహా ఇచ్చాడు. శ్రీహాన్ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పాడు. మెరీనా మదర్ ఇండియా అని ఐతే ఆమె వీక్నెస్ అనే ప్రాబ్లెమ్ రోహిత్ అని చెప్పేసాడు ఇక రేవంత్ కి కోపం, ఆవేశం, గారాబం ఎక్కువ అని అన్నాడు. ఇక ఇనయకి వంద మార్కులు ఇచ్చాడు. ఆదిరెడ్డి, గీతూకు 90మార్కులిచ్చాడు. తర్వాత బాలాదిత్య విషయానికి వచ్చి మంచితనం మేకప్ వేసుకుని నటిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు ఐదు వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



