ENGLISH | TELUGU  
Home  » TV News

అప్పు, కళ్యాణ్ లని కిడ్నాప్ చేసిన రౌడీలు.. కావ్య, రాజ్ లపై రుద్రాణి కుట్ర!

on Feb 15, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -956 లో... అప్పు తన కొలీగ్ కి రౌడీల గురించి కనుక్కోమని చెప్తుంది. అదంతా కళ్యాణ్ విని.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటాడు. ప్లీజ్ ఈ ఒక్కసారి అని అప్పు రిక్వెస్ట్ చేస్తుంది. 

 

మరొకవైపు రుద్రాణి తన కూతురు, కొడుకుతో మాట్లాడుతుంది. ఇంత చేసి ప్లాన్ ఫెయిల్ అయిందని రాహుల్ అంటాడు. మినిస్టర్ ని రిక్వెస్ట్ చేసి నా పేరు బయటకు రాకుండా చూసానని రుద్రాణి అంటుంది. ఆ కావ్య, రాజ్ కలిసి ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నారట.. దానికి సగం ఆస్తి రాసిస్తున్నారని రేఖ చెప్తుంది. మరి ఎవరు అడ్డు చెప్పలేదా అని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి అత్తయ్య మాత్రమే అడ్డుచెప్పిందని రేఖ చెప్తుంది. నేను అక్కడ ఉండి ఉంటే ఆ ఆలోచనని చంపేసేదాన్ని అని రుద్రాణి అంటుంది. 

 

అప్పుడే రౌడీ ఫోన్ చేసి మేడమ్ మాకోసం పోలీసులు వెతుకుతున్నారంట అని చెప్తాడు. మీరు ఎవరు కన్పించవద్దు.. నా పేరు అసలు బయటకు రావద్దని రుద్రాణి చెప్తుంది. కళ్యాణ్, అప్పులని కిడ్నాప్ చేసి ఆస్తి కోసం కావ్య, రాజ్ లే కిడ్నాప్ చేసారని అనుకునేలా చేస్తానని రుద్రాణి ప్లాన్ చేస్తుంది.

 

ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు బయటకు వెళ్తారు. వాళ్ళు బయటకు వెళ్లారని రుద్రాణికి రేఖ ఫోన్ చేసి చెప్తుంది. కళ్యాణ్, అప్పు వెళ్తుంటే ఒకతను పడిపోయి ఉంటాడు. కళ్యాణ్ కార్ దిగగానే అతడిని కొట్టి అప్పు, కళ్యాణ్ ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు.

 

మరొకవైపు రాజ్, కావ్య ఇంట్లో అందరిని పిలుస్తారు. నిన్నే కదా నా నిర్ణయం చెప్పాను. మళ్ళీ ఎందుకని ధాన్యలక్ష్మి అంటుంది. ఆస్తి సగం రాస్తే కళ్యాణ్ కి నష్టం జరుగుతుందని కదా మీ భయం.. అందుకే సగం ఆస్తి కళ్యాణ్ పేరున రాసాం.. ఇదిగో డాక్యుమెంట్స్ అని రాజ్ అంటాడు. అలా ఎలా చేస్తారని అపర్ణ అడుగుతుంది. ఇంట్లో వాళ్ళని అడగాలి కదా అని అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.