Brahmamudi: తులసికి దగ్గరవ్వాలని చెప్పిన కావ్య.. పాపని దక్కించుకుంటారా?
on Jan 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -944 లో... మన పాప ఆ మినిస్టర్ దగ్గర ఉందని కావ్య జరిగిందంతా రాజ్ కి చెప్తుంది. అసలు నేను నమ్మలేకపోతున్నానని రాజ్ అంటాడు. ఒకసారి మీరు నాతో వస్తే మీకు క్లియర్ గా తెలుస్తుందని రాజ్ ని కావ్య తన వెంట మినిస్టర్ ఇంటికి తీసుకొని వెళ్తుంది.
అక్కడ చాటుగా ఉండి తులసి, మినిస్టర్ మాట్లాడుకుంటుంటే వింటారు. ఎందుకు పాపపై ఇంత ప్రేమ పెంచుకుంటున్నావని మినిస్టర్ తన భార్యని అడుగుతాడు. పాప నా ప్రాణమని తులసి ఎమోషనల్ అవుతుంది. అవును మీరు ప్రొద్దున ఆ కావ్య దగ్గర నుండి పాపని అలా లాగేసుకున్నారు ఏంటని తులసి అడుగుతుంది.
అలా మన బిడ్డని ఎవరు పడితే వారు ఎత్తుకోవడానికి వీలు లేదు నా బిడ్డని నేను తీసుకున్నాను కదా అని మినిస్టర్ అంటాడు. అయినా సరే అలా లాక్కుంటే బాధపడుతారని తులసి అంటుంది. ఆకలేస్తుంది పదా అని మినిస్టర్ అనగానే పాపని పడుకోబెట్టి ఇద్దరు వెళ్లి భోజనం చేస్తారు.
అప్పుడే కావ్య, రాజ్ ఇద్దరు వాళ్ళు చూడకుండా లోపలికి వస్తారు. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. మన బిడ్డని చూడండి ఎలా ఉందోనని కావ్య మురిసిపోతుంది. అచ్చం నీలాగే ఉందని రాజ్ అంటాడు. అప్పుడే పాప ఏడుస్తుంది. తులసి వాళ్ళు వస్తారని త్వరగా రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. పాప ఏడుస్తుంటే తులసి చూడలేకపోతుంది.
ఆ తర్వాత రాజ్, కావ్య బయటకు వస్తారు. సారీ కావ్య నేను నిన్ను అర్థం చేసుకోలేదు.. నువ్వు ఎన్ని చెప్పినా పట్టించుకోలేదని రాజ్ అంటాడు. మన బిడ్డని దక్కించుకోవడానికి నేను ఏం చెయ్యడానికి అయినా వెనుకాడనని రాజ్ అంటాడు. మనం ముందు తులసి గారికి దగ్గర అవ్వాలని కావ్య అంటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే గొడవ అవుతుంది. వద్దని కావ్య చెప్పగానే రాజ్ సరే అంటాడు.
ఆ తర్వాత మరుసటి రోజు కావ్య పాపతో ఆడుకుంటుంటే అపర్ణ, ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే రాజ్ వస్తాడు. కావ్యలో వచ్చిన మార్పుకి చాలా సంతోషమని అంటారు. కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నిన్న తులసి పాపని తీసుకొని హాస్పిటల్ కి వస్తుందనడం విన్నాం కదా.. మనం కూడా వెళ్ళాలని కావ్య అనగానే రాజ్ సరే అంటాడు.
తులసి పాపతో హాస్పిటల్ కి వస్తుంది. రాజ్, కావ్య కూడా హాస్పిటల్ కి వెళ్తారు. తులసికి కావ్య పరిచయం కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



