Brahmamudi : రాజ్ ప్రపోజల్ కి నో చెప్పిన కావ్య.. అప్పు తప్పించుకుందిగా!
on Aug 5, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -791 లో..... కావ్య ప్రెగ్నెంట్ అని షాక్ అవుతుంది. అప్పుడే అప్పు వస్తుంది. తనని పట్టుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం అప్పుకి తెలుస్తుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా మీరెప్పుడు కలిశారని అప్పు అనగానే తనకు ఆక్సిడెంట్ కాకముందే అని కావ్య అంటుంది. మరి హ్యాపీగా ఇంట్లో అందరికి చెప్పి స్వీట్ చేపించుకోవాలని అప్పు అనగానే ఇప్పుడు నేనున్న సిచువేషన్ ఏంటని కావ్య అంటుంది. నాకు ఇప్పుడు అయన ప్రపోజ్ చెయ్యడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలని కావ్య టెన్షన్ పడుతుంది.
నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకు.. ముందు వెళ్లి బాబుని రేవతి గారికి అప్పజెప్పిరా అని కావ్య అనగానే అప్పు వెళ్ళిపోతుంది. మరొకవైపు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నానని రాజ్ హ్యాపీగా వస్తుంటాడు. ఆ తర్వాత బాబుని తీసుకొని అప్పు వెళ్లిపోతుంటే అప్పు వెనకాల రాహుల్ ని ఫాలో అవడం తను గమనిస్తుంది. వెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది. కానిస్టేబుల్ రాహుల్ కార్ ముందు ఆగి మీ కార్ స్మగిలింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చెయ్యాలి అంటారు. నా కార్ లో ఉండడం ఏంటని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ చెక్ చేసి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పు ఎప్పుడో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరు రాజ్ వచ్చి ఎప్పుడు కావ్యకి ప్రపోజ్ చేస్తాడా అని వెయిట్ చేస్తుంటారు.
రాజ్ వచ్చి కావ్యని పిలుస్తాడు. కావ్య బాధగా పై నుండి కిందకి వస్తుంది. ఇక నా వల్ల కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నానని రాజ్ తన మనసులో మాట చెప్పగానే కావ్య నాకు మీరంటే ఇష్టం లేదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో కావ్య వద్దని చెప్పినందుకు రాజ్ బాధగా వెళ్ళిపోతాడు. రాజ్ నడుచుకుంటు వెళ్తుంటే ఆతని వెనకాల నుండి ఏదో వెహికల్ వచ్చి డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



