ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : భార్య ఇంట్లోకి రావడం కోసం ఆ ప్రాజెక్ట్.. అతను అంగీకరించగలడా!

on Nov 13, 2024


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -566 లో.....కావ్య దగ్గరకి ఒక పెద్దాయన వచ్చి.. నాకు టెంపుల్ సంబంధించిన జ్యువలరీ డిజైన్స్ కావాలని  అంటాడు. దానికి కావ్య సరే అని చెప్తుంది. ఆ విషయం రాజ్ కి కావ్య చెప్పాలని వెళ్తుంది కాని రాజ్ ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విషయం శృతి చెప్పగానే కావ్య కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి రాజ్ ఎక్కడ అని అడుగుతుంది. దాంతో ఇందిరదేవి రాజ్ ని పిలుస్తుంది.

మీరు చేస్తుందేంటి చెప్పకుండా ఇలా ఫైల్ తీసుకొని వస్తే ఏంటని కావ్య కోప్పడుతుంది. నీకు చెప్పేది ఏంటని రాజ్ పొగరుగా మాట్లాడతాడు. తాతయ్య గారు ఉమేష్ చంద్రగారి ప్రాజెక్ట్ వచ్చింది. అది రెండు రోజుల్లో ఇవ్వాలి.. నేను డిజైన్స్ వేస్తాను గనీ ఆయనకి ఉన్న అనుభవం సమర్థత లేదు.. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే బాగుంటుందని కావ్య అనగానే.. నేను చెయ్యనని రాజ్ అంటాడు. ఒక పని చెయ్యండి ఒకే ప్రాజెక్ట్ పై ఇద్దరు వేరు వేరుగా చెయ్యండి. ఎవరిది సెలక్ట్ అవుతుందో వాళ్లే సీఈఓ అని సీతారామయ్య అంటాడు. దానికి రాజ్ ఒప్పుకుంటాడు కానీ కావ్య గెలిస్తే నువు ఓడిపోతే కావ్యని భార్యగా ఒప్పుకొని తీసుకొని రావాలని సీతారామయ్య అనగానే దానికి రాజ్ ఒప్పుకుంటాడు.

ఆ తర్వాత కావ్య బయటకు వచ్చి ఆయన ప్రేమతో నన్ను తీసుకొని రావాలి గనీ ఇలా తీసుకొని వస్తే నాకు నచ్చదన్నట్లు కావ్య మాట్లాడుతుంది. ముందు నువ్వు ఇంట్లోకిరా అప్పుడు ప్రేమతో వాడే దగ్గర అవుతాడని ఇందిరాదేవి అంటుంది. ఇక కావ్య తప్పక సరేనని అంటుంది. నేను గెలవడానికి ట్రై చేస్తానని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యపై రాజ్ గెలవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.