Brahmamudi : ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. వాళ్ళు చూస్తారేమోనని కావ్య టెన్షన్!
on Apr 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -692 లో..... యామిని రాజ్ ని ఎక్కడ తన ఫ్యామిలీ చూస్తుందోనని టెన్షన్ పడుతుంది. అందుకే రాజ్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళాలనుకుటుంది. బావ వేరొక దగ్గర కళ్యాణం జరుగుతుంది కదా అక్కడికి వెళదామని రాజ్ తో యామిని అంటుంది. ఎక్కడ అయితే ఏంటి అని రాజ్ అంటాడు. యామిని పేరెంట్స్ కూడా వేరొక దగ్గరికి వెళదామని రాజ్ ని ఒప్పిస్తారు. రాజ్, యామిని వాళ్ళు వెళ్తుంటారు. నేను కార్ తీసుకొని వస్తానంటూ రాజ్ వెళ్తాడు. ఒకసారి కళావతిని కలవాలని తన కోసం చూస్తాడు.
రుద్రాణి బయట తిరుగుతుంటే ఎక్కడ రాజ్ ను చూస్తుందోనని కావ్య బయటకు వచ్చి రాజ్ కోసం చూస్తుంది. కావ్యని యామిని చూస్తుందేమోనని ఒక గదిలోకి తీసుకొని వెళ్తాడు రాజ్. ఏంటి ఇలా లాక్కొచారు అక్కడ అని కావ్య అంటుంది. ఆ తర్వాత బయటకు వెళదామంటే పూజారి తాళం వేస్తాడు. డోర్ రాకపోవడంతో అయ్యో కళ్యాణం చూడలేకపోతున్నానని కావ్య ఫీల్ అవుతుంటే.. ఆ గదిలో ఉన్న ఫొటోస్ ఇంక పూజ సామానుతో రాజ్ పూజకి అన్ని సిద్ధం చేస్తాడు. ఇద్దరు పీటలపై కూర్చొని పూజ చేస్తారు. దాంతో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పూజారి డోర్ తియ్యగానే ఇద్దరు బయటకు వస్తారు. యామిని చూస్తుందేమోనని కావ్యకి బై చెప్పి వెళ్ళిపోతాడు రాజ్.
ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. కార్ కీస్ కూర్చున్న దగ్గర మర్చిపోయానని వెళ్ళాను.. కళ్యాణం జరిగేటప్పుడు వెళ్లొద్దు అంటే అక్కడే ఉన్నానని రాజ్ చెప్తాడు. నేను అక్కడికి వచ్చాను. నువ్వు అక్కడ లేవని యామిని అంటుంటే.. ఉన్నాను అంటూ రాజ్ కవర్ చేస్తాడు. మరొకవైపు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావని కావ్యని అపర్ణ అడుగుతుంది. కావ్య ఏదో కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యని కలవటానికి ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. జీపీ ఎస్ ద్వారా యామిని చూస్తుంది. రాజ్ ఏంటి అక్కడికి వెళ్ళాడని టెన్షన్ పడుతుంది. సీసీటీవీ లో రాజ్ ఆఫీస్ కి రావడం కావ్య చూస్తుంది. ఎక్కడ ఎంప్లాయిస్ చూస్తారోనని కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



